ETV Bharat / sitara

సుమను ఆటపట్టించిన హీరో నాని

author img

By

Published : May 16, 2021, 12:39 PM IST

సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'క్యాష్'​ షోకు నాని 'టక్​జగదీశ్'​ చిత్రబృందం అతిథులుగా విచ్చేసింది. ఇందులో హీరో నాని.. సుమను ఆటపట్టించారు. మొత్తంగా ఈ షో ఆద్యంతం సందడి సందడిగా సాగింది. దీనికి సంబంధించిన ప్రోమోనూ చూసేయండి...

suma
సుమ

నేచురల్‌స్టార్‌ నాని.. ప్రముఖ వ్యాఖ్యాత సుమను సరదాగా ఆటపట్టించారు. 'సుమ ఆంటీ' అంటూ పిలిచారు. ఆమె వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న 'క్యాష్‌' షోలో తాజాగా 'టక్‌ జగదీశ్‌' చిత్రబృందం సందడి చేసింది.

నటీనటులు నాని-రీతూవర్శతోపాటు చిత్రదర్శకుడు శివ నిర్వాణ ఈ షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా సుమ మాట్లాడుతూ..'అమ్మాయిలకు ఆంటీ అని పిలిస్తే నచ్చదు' అని అంటే నాని ఆమెను ఆటపట్టించారు. 'ఈరోజు సుమ ఆంటీ షోకి రావడం నాకెంతో ఆనందంగా ఉంది. సుమ ఆంటీకి నేను వీరాభిమానిని. సుమ ఆంటీ అంటే నాకెంతో ఇష్టం' అని సరదాగా అన్నారు. అంతేకాకుండా.. 'ఆంటీ అని ఇకపై పిలవనని కేవలం సుమ పిన్ని అంటాను' అని వరుస పంచులు వేశారు.

మరోవైపు, సుమ-శివ నిర్వాణల సరదా సెటైర్లతో క్యాష్‌ షో ఆద్యంతం జోష్‌ఫుల్‌గా మారింది. అయితే, ఇలాంటి ఎన్నో సరదా విశేషాలతో సాగిన ఈ పూర్తి ఎపిసోడ్‌ చూడాలంటే మే 22వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి...

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.