తెలుగు చిత్రసీమలో నానిది ప్రత్యేక శైలి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా అతనికి 'బ్రోచేవారెవరురా' చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ కొత్త వినిపించాడట. కథ విన్న నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్లో టాక్.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూపొందించనుందట. ఇక నాని.. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నటించిన 'వి' చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 'టక్ జగదీష్' చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. ఈ మధ్య కాలంలో 'శ్యామ్ సింగరాయ్' అనే చిత్రం చేస్తున్నట్లు ప్రకటించాడు. రాహుల్ సాంకృత్యన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఇదీ చూడండి : గాయని నేహా కక్కర్: చిన్న గది నుంచి పెద్ద బంగ్లా వరకు