ETV Bharat / sitara

నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి - శ్యామ్ సింగరాయ్ సాయి పల్లవి

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. దసరా పండగ పురస్కరించుకుని ఈ సినిమాలోని హీరోయిన్లను ప్రకటించింది చిత్రబృందం.

Nani to romance Sai Pallavi, Krithi Shetty
నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి
author img

By

Published : Oct 25, 2020, 2:43 PM IST

'వి' సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం 'టక్ జగదీష్', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాల్లో నటిస్తున్నాడు. 'టక్ జగదీష్' షూటింగ్​లో ఉండగా, 'శ్యామ్ సింగరాయ్' డిసెంబర్​లో చిత్రీకరణ ప్రారంభించనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరనే విషయమై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈరోజు దసర పండగ పురస్కరించుకుని ఇందులో నాని సరసన ఆడిపాడే హీరోయిన్లను ప్రకటించింది చిత్రబృందం.

ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవితో పాటు కృతి శెట్టి కనిపించనుంది. ఇప్పటికే నాని-సాయిపల్లవి కలయికలో వచ్చిన 'ఎంసీఏ' మంచి విజయం సాధించింది. వీరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి. కృతిశెట్టి 'ఉప్పెన' ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.

'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.