ETV Bharat / sitara

కరోనా ఎఫెక్ట్: నాని, సుధీర్​ల 'వి' వాయిదా - కరోనా కారణంగా నాని, సుధీర్​ల 'వి' వాయిదా

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'వి'. ఉగాది కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం.

V movie PostPoned
వి సినిమా
author img

By

Published : Mar 14, 2020, 1:01 PM IST

కరోనా ప్రభావంతో వివిధ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందులో సినీ రంగం ఒకటి. విదేశాల్లో జరగాల్సిన షూటింగ్​లను ప్రస్తుతం వాయిదా వేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు నాని 'వి' సినిమా విడుదలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

నాని-సుధీర్​బాబు నటిస్తున్న 'వి' సినిమాను తొలుత ఈనెల 25న ఉగాది కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలో 'వి' సినిమాను వాయిదా వేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది చిత్రబృందం. ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది. కానీ తేదీపై స్పష్టతనివ్వలేదు.

V movie PostPoned
'వి' వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.