ETV Bharat / sitara

ఎన్టీఆర్ జయంతికి నందమూరి హీరోల అప్​డేట్లు - కల్యాణ్​ రామ్​

లెజండరీ యాక్టర్​ ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా నందమూరి హీరోలు నటిస్తోన్న చిత్రాల నుంచి అప్​డేట్లు రానున్నాయి. ఎన్​బీకే ఫిల్మ్స్​ అప్​డేట్​తో పాటు కల్యాణ్​ రామ్​ కొత్త చిత్రానికి సంబంధించి అనౌన్స్​మెంట్​ను ప్రకటించనున్నారు.

Nandamuri heroes movie updates on NTR birth anniversary
ఎన్టీఆర్ జయంతికి నందమూరి హీరోల అప్​డేట్లు
author img

By

Published : May 27, 2021, 6:38 AM IST

శుక్రవారం(మే 28) లెజండరీ యాక్టర్​ ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా నందమూరి హీరోల చిత్రాల నుంచి కొన్ని అప్​డేట్లు రానున్నాయి. తొలుత ఎన్​బీకే ఫిల్మ్స్​ బ్యానర్​ తరఫున కథానాయకుడు బాలకృష్ణ ఓ ప్రకటన చేయనున్నారు. గురువారం ఉదయం 8.45 గంటలకు ఆ సర్​ప్రైజ్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Nandamuri heroes movie updates on NTR birth anniversary
ఎన్​బీకే ఫిల్మ్స్​ అప్​డేట్​ పోస్టర్​

అయితే బాలయ్య నుంచి ఏ ప్రకటన రాబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు 'అఖండ' చిత్ర అప్​డేట్​ అంటూ ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ అరంగేట్రంపై స్పష్టత రానుందని ప్రచారం జరుగుతోంది.

టైమ్​ ట్రావెల్​ కథతో..

కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఎంతోమందిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు హీరో నందమూరి కల్యాణ్​రామ్​. ఈ నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న మరో కొత్త చిత్రానికి కూడా వశిస్ట్​ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. కల్యాణ్​రామ్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది. శుక్రవారం (మే 28) ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్​మెంట్​ను అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

నందమూరి కల్యాణ్​రామ్​ కొత్త సినిమా అప్​డేట్​ పోస్టర్​

ఇదీ చూడండి: 'రాధే' చిత్ర సమీక్షకునికి సల్మాన్​ లీగల్​ నోటీసులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.