బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్‌కు ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందో.. 90ల్లో బి. గోపాల్-బాలయ్య కలయికకు అంతకు మించే ఉండేది. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'పల్నాటి బ్రహ్మనాయుడు'.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ముఖ్యంగా 'నరసింహనాయుడు', 'సమరసింహారెడ్డి' టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మళ్లీ అదే కాంబో ఇప్పుడు ఓ సినిమా కోసం కలిసి పనిచేయనుందని సమాచారం.
ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదే కాకుండా ఇటీవలే విన్న కథల్లో ఒకటి బాలయ్యకు తెగ నచ్చేసిందట. దానికి గోపాల్ అయితే సరైన రీతిలో తెరకెక్కించగలడాని నందమూరి హీరో భావించాడు. త్వరలో ఈ విషయంపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.
2003లో చివరిసారిగా వీరిద్దరూ 'పల్నాటి బ్రహ్మనాయుడు' కోసం కలిసి పనిచేశారు. మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తారో? లేదే? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 2017లో గోపీచంద్ హీరోగా వచ్చిన 'ఆరడగుల బుల్లెట్' చిత్రాన్ని తీశారు బి.గోపాల్. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.