ETV Bharat / sitara

నేను డైరెక్టర్​ ఆర్టిస్ట్​ని.. ఎలా చెబితే అలా చేస్తా: బాలయ్య - అఖండ

Akhanda Success Meet: అఖండ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు హీరో బాలకృష్ణ. ఇది చలనచిత్ర పరిశ్రమ విజయని పేర్కొన్నారు. అఖండ సక్సెస్​ మీట్​ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బాలయ్య.

akhanda
అఖండ
author img

By

Published : Dec 2, 2021, 10:47 PM IST

Updated : Dec 3, 2021, 6:20 AM IST

Akhanda Success Meet: నందమూరి నటసింహం బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్​లో వచ్చిన 'అఖండ' అభిమానులకు ఫుల్​మీల్స్​ పెట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్​లో కూడా హిట్​ టాక్​ కొట్టేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్​ మీట్​ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ.. ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

అఖండ మూవీ ప్రెస్ మీట్

ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చిత్రానికి ఇంత అఖండ విజయం అందించిన ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు. కొత్తదనాన్ని తెలుగు వారు ఆదరిస్తారు అనడానికి ఉదాహరణ ఈ అఖండ. ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. తమన్​ మంచి బాణీలు సమకూర్చారు. మా సినిమాలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడ్డారు. సినిమానే మా ధ్యేయం. నేను ఓ డైరెక్టర్​ ఆర్టిస్ట్​ని.. కాబట్టి డైరెక్టర్​ ఎలా చెబితా అలా నడుచుకుంటాను.

-నందమూరి బాలకృష్ణ

అఖండ స్టార్ట్​ అయినప్పటి నుంచి ఒక ట్రాన్స్​లో ఉన్నాం. ఈ సినిమాలో వీలైనంత ఆధునికత జోడించేందుకు ప్రయత్నించాం. ఇది కేవలం భక్తి సినిమాగా కాకుండా యూత్​ఫుల్​గా ఉండేలా కృషి చేశాము. ఔట్​పుట్​ చూశాక చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను అభిమానులు మాస్ జాతర చేశారు. ​బాలయ్య గారికి హిట్​ వస్తే ఇండస్ట్రీకి హిట్​ వచ్చినట్టే. ఈ అఖండ విజయాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు.

-తమన్​, సంగీత దర్శకుడు

ఈ సినిమాని ఏకగ్రీవంగా హిట్​ చేశారు. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా.. ప్రేక్షకులను, నందమూరి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సినిమా హాళ్ల దగ్గర అభిమానుల సందడి చూసి చాలా రోజులైంది. అభిమానుల ఉత్సాహం చూశాక నేను సంతృప్తి చెందాను. ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా హిట్​ చేసిన ప్రేక్షకులకు, ఆదరించిన నందమూరి అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఇండస్ట్రీ విజయం.

-బోయపాటి శ్రీను, దర్శకుడు

ఇదీ చూడండి : అఖండ 'మాస్​ జాతర' కాదు.. అంతకుమించి.. ఇవే సాక్ష్యాలు!

Last Updated : Dec 3, 2021, 6:20 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.