Nagarjuna Ghost movie: నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్ చౌహాన్ కథానాయిక. దుబాయ్‌లో యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రబృందం... తాజాగా దాన్ని పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు తెలిపింది మూవీటీమ్. "భారీ యాక్షన్ సన్నివేశాలు సహా ఓ సాంగ్‌ను ఈ షెడ్యూల్లో పూర్తి చేసుకున్నాం" అని ట్వీట్ చేసింది. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ నుంగ్, అతని బృందం నేతృత్వంలో ఈ పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున మాజీ రా అధికారిగా కనిపించనున్నారు.

Vaishnav tej Rangaranga vaibhavanga movie release date: 'ఉప్పెన'తో హీరోగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు పొందాడు వైష్ణవ్ తేజ్. రెండో ప్రయత్నం.. 'కొండపొలం' చిత్రంతో యువతలో స్ఫూర్తినింపిన ఆయన ప్రస్తుతం ఓ ప్రేమ కథలో నటిస్తున్నారు. అదే 'రంగరంగ వైభవంగా'. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జులై 1న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ మేరకు నాయికానాయికల స్టిల్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన కేతికా శర్మ నటిస్తోంది. వీరిద్దరు రిషి, రాధ పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'సలార్' షూటింగ్‌కు బ్రేక్!.. సౌత్ఇండస్ట్రీపై రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్