హీరోయిన్ సమంత.. కొత్త సినిమాలు అంగీకరించకపోవటానికి కారణం అవకాశాలు తగ్గడమేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వదంతులన్నీ నిజం కాదంటున్నాడు ఆమె భర్త, హీరో నాగచైతన్య. తక్కువ చిత్రాలే చేసినా, గుర్తుండిపోయే పాత్రల్లో నటించటమే సామ్‌కు ఇష్టమని చెబుతున్నాడు.
"పెళ్లి తర్వాత సమంతకు అవకాశాలు తగ్గాయన్నది నిజం కాదు. గత రెండేళ్లలో కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో కనిపించింది. నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే పాత్రల్లో కనిపించడమే సామ్‌కు ఇష్టం. సరైన కథ కనిపిస్తే నటిస్తుంది. ఎక్కువ సినిమాలు తన ఖాతాలో వేసుకోవాలనే ఆలోచన లేదు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తోంది." -నాగచైతన్య, నటుడు
గతేడాది 'రంగస్థలం', 'మహానటి', 'అభిమన్యుడు', 'యూటర్న్'లతో అలరించిన సమంత... ఈ ఏడాది అదే జోరును కొనసాగించింది. భర్త నాగచైతన్యతో తొలిసారి కలిసి నటించిన 'మజిలీ', 'ఓ బేబీ'లతో హిట్లు అందుకుంది.
ఇదీ చూడండి: 'ఆయనతో నటించడం అంత తేలిక కాదు'