ETV Bharat / sitara

తుదిశ్వాస వరకు నా సోదరులతోనే ఉంటా: నాగబాబు - nagababu jabardast

తనకు రాజకీయాలంటే ఆసక్తి పోయిందని నటుడు నాగబాబు(nagababu family) అన్నారు. తుదివరకు సోదరులతోనే ఉంటానని ఓ నెటిజన్​ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

nagababu political re entry
నాగబాబు
author img

By

Published : Oct 1, 2021, 7:15 AM IST

వేర్వేరు సిద్ధాంతాలు, భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ తుదిశ్వాస వరకూ తన సోదరులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లను(pawan kalyan twitter) విడిచిపెట్టనని నటుడు నాగబాబు(nagababu family) అన్నారు. బుధవారం ఇన్‌స్టా వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సెటైరికల్‌గా సమాధానాలు ఇచ్చిన ఆయన.. మరోసారి రాజకీయాల గురించి స్పందించారు. రాజకీయాలపై తనకు ఆసక్తి పోయిందని అన్నారు.

nagababu political re entry
మెగాఫ్యామిలీలోని హీరోలు

ఈ మేరకు ఓ నెటిజన్‌.. ;రాజకీయాలంటే ఆసక్తిలేనప్పుడు మీరెలా ప్రజలకు సాయం చేయగలరు?' అని ప్రశ్నించగా.. 'అంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలి. లేకుంటే చేయకూడదు. అంతేగా.. అరెరే.. పెద్ద సమస్య వచ్చిందే.. ఈ విషయం తెలియక చాలా పొరపాటు చేశానే..! (కొంచెంసేపు జోక్స్‌ పక్కనపెడితే).. సిద్ధాంతాలు వేరైనప్పటికీ తుదిశ్వాస వరకూ నా సోదరులతోనే ఉంటాను. రాజకీయంగా కాకపోయినా.. కష్టాల్లో ఉన్నవారికి నాకు చేతనైనంత సాయం చేస్తాను' అని నాగబాబు(nagababu height) సమాధానమిచ్చారు. అనంతరం మరో నెటిజన్‌.. 'మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ఏం మారాలి?' అని అడగ్గా.. 'మగాడి మైండ్‌సెట్‌ మారాలి' అంటూ నాగబాబు చెప్పారు.

మరో నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'మంది ముందు మాట్లాడేవాడు పులి.. మంది వెనుక మాట్లాడేవాడు పిల్లి' అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

మీరు తప్పు అని నిరూపిస్తా..

నెట్టింట్లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే నాగబాబు(nagababu networth).. ఓ ఆసక్తికరమైన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. 'నేను బలహీనుడినని నువ్వు అంటే.. బలవంతుడినని చెప్పడం కోసం నేను సమయాన్ని వృథా చేయను. మరింత ధృడంగా మారి.. అసమానమైన శిఖరాగ్రాలను అధిరోహించి నువ్వు తప్పు అని నిరూపిస్తాను' అని నాగబాబు పోస్ట్‌ పెట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.