ETV Bharat / sitara

సినిమా అప్​డేట్స్: వరలక్ష్మి అలా.. నాగశౌర్య ఇలా

'క్రాక్​' సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర షూటింగ్ పూర్తవగా, యువహీరో నాగశౌర్య.. మరో చిత్రాన్ని ప్రారంభించాడు.

naga shourya, krack movie new updates
సినిమా అప్​డేట్స్: వరలక్ష్మి అలా.. నాగశౌర్య ఇలా
author img

By

Published : Oct 28, 2020, 1:57 PM IST

యువహీరో నాగశౌర్య వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. స్పోర్ట్స్​ డ్రామాలో నటిస్తూ, ఇటీవలే కొత్త ప్రాజెక్టులో నటిస్తున్న ఇతడు.. బుధవారం, మరో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తన సొంత బ్యానర్​లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో దీనిని చేయనున్నారు.

naga shourya movie new update
నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభోత్సవం

హైదరాబాద్​లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడితో పాటు హీరో నారా రోహిత్ హాజరయ్యారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించడం సహా షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

'క్రాక్' సినిమాలో జయమ్మగా కనిపించనున్న వరలక్షి శరత్​కుమార్.. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రబృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లు. గోపీచంద్ మలినేని దర్శకుడు. వచ్చే సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

varu with gopichand
దర్శకుడు గోపీచంద్​తో నటి వరలక్ష్మి

ఇది చదవండి: 'నవరస' కోసం ఒక్కటైన తమిళ చిత్రపరిశ్రమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.