నాగశౌర్య హీరోగా, సొంత నిర్మాణ సంస్థలో రూపొందించిన చిత్రం 'అశ్వథ్థామ'. తన స్నేహితుడి సోదరి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ రాశాడు శౌర్య. ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ కథానాయకుడు, తనకున్న ఓ సమస్యను బయటపెట్టాడు.
"అవును నాకు ఉన్నట్లుండి కోపమొచ్చేస్తుంది. సెట్లో వాళ్లను తిడతా. నా దర్శకులు, కెమెరామెన్లు, రచయితలపై ఎన్నో సందర్భాల్లో గట్టిగే అరిచేసేవాడిని. నిజానికి నేనలా చేసేది మంచి అవుట్‌పుట్ సాధించడం కోసమే. ఈ కోపం సినిమాకు మంచి చేసేది మాత్రమే. ఇదే సమయంలో మా బృందంపై అరవడం వల్ల వాళ్ల సినీ కెరీర్ పట్ల వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఏర్పడుతుంది"
- నాగశౌర్య, హీరో
'అశ్వథ్థామ' సినిమాను రమణ తేజ అనే నూతన దర్శకుడు తీశాడు. మెహరీన్ హీరోయిన్గా నటించింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: బాలయ్య చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నదెవరో తెలుసా..!