ETV Bharat / sitara

గూఢచారిగా కల్యాణ్​ రామ్.. కిషోర్​తో చైతూ! - kalyan Ram as Agent

వరుస చిత్రాలతో జోరుమీదున్న అక్కినేని యువహీరో నాగ చైతన్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కల్యాణ్ రామ్ గూఢచారిగా ఓ మూవీ రూపొందబోతోందని సమాచారం.

Naga Chaitanya kalyan Ram
చైతూ, కల్యామ్ రామ్
author img

By

Published : Jul 3, 2021, 6:30 AM IST

నాగచైతన్య, కిషోర్‌ తిరుమల కలయికలో సినిమా కోసం సన్నాహాలు మొదలయ్యాయా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎప్పట్నుంచో వినిపిస్తున్న ఈ కలయికలో సినిమా కోసం కుటుంబ వినోదంతో కూడిన కథ కూడా పక్కా అయినట్టు తెలిసింది.

నాగచైతన్య ప్రస్తుతం 'థ్యాంక్యూ' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత హిందీ చిత్రం 'లాల్‌సింగ్‌ ఛద్దా' కోసం రంగంలోకి దిగుతారు. 'బంగార్రాజు' పూర్తి చేయాల్సి ఉంది. ఆ చిత్రాల తర్వాత కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయడానికి నాగచైతన్య సిద్ధమైనట్టు తెలిసింది. కిషోర్‌ తిరుమల ప్రస్తుతం శర్వానంద్‌తో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే చిత్రం చేస్తున్నారు. నాగచైతన్య - కిషోర్‌ కలయికలో సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నట్టు తెలిసింది.

గూఢచారిగా కల్యాణ్ రామ్

వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేసేందుకు కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'బింబిసార' అనే భారీ చారిత్రక సినిమా చేస్తున్నారు. ఇది తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇప్పుడిది సెట్స్‌పై ఉండగానే ఆయన మరో కొత్త సినిమాకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. నవీన్‌ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 1950ల కాలం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందనుందని, ఇందులో కల్యాణ్‌రామ్‌ గూఢచారిగా కనిపిస్తారని ప్రచారం వినిపిస్తోంది. అభిషేక్‌ నామా ఈ ప్రాజెక్ట్‌ నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఈ ఏడాది ఆఖర్లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

ఇవీ చూడండి: 'ఐస్​క్రీమ్​' బ్యూటీ బోల్డ్ పోజులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.