ETV Bharat / sitara

అజయ్​తో పెళ్లి.. నాన్న ఒప్పుకోలేదు: కాజోల్ - కాజోల్ న్యూస్

'త్రిభంగ' సినిమా విడుదల సందర్భంగా నటి కాజోల్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు, తన తండ్రి ఒప్పుకోలేదని తెలిపింది.

My father was against me getting married at 24: Kajol
అజయ్​తో పెళ్లి.. నాన్న ఒప్పుకోలేదు: కాజోల్
author img

By

Published : Jan 15, 2021, 5:30 AM IST

Updated : Jan 15, 2021, 6:18 AM IST

కథానాయకుడు అజయ్ దేవగణ్​తో పెళ్లికి తన నాన్న(షోమ్‌ ముఖర్జీ) ఒప్పుకోలేదని​ బాలీవుడ్​ నటి కాజోల్‌ చెబుతోంది. ఆమె నటించిన 'త్రిభంగ' శుక్రవారం(జనవరి 15)విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల్ని పంచుకుంది.

"నిజ జీవితంలో ఆడ-మగ అనే లింగబేధం లేకుండానే పెరిగాను. 24వ ఏటా అజయ్‌తో పెళ్లి అని చెప్పినప్పుడు, నాన్న ఒప్పుకోలేదు. ఇంకొన్నాళ్లు నటించాలని చెప్పారు. అమ్మ మాత్రం నా అభిప్రాయానికి మద్దతు పలికింది. నీకు మనసులో ఏది అనిపిస్తుందో అదే చెయ్యమని చెప్పింది. నా చట్టుపక్కల ఉన్నవారు నా వెనుకే నిలబడ్డారు. అందువల్లే అనుకున్న పని చేయగలిగాను. 'త్రిభంగ' చిత్రంలో అను(కాజోల్‌) ప్రేమను, ద్వేషాన్ని, అలవాట్లను చాలా లోతుగా చూస్తుంది. నాలోని లక్షణం అది. మూడు తరాల మహిళల మధ్య చోటుచేసుకున్న ఓ కుటుంబ సంఘటనల నేపథ్య కథతో ఈ సినిమా తీశాం" అని కాజోల్ చెప్పింది.

ఈ సినిమాలో కాజోల్‌ ఒడిస్సీ నృత్యకారిణిగా నటించింది. మిథిలా పాల్కర్‌, వైభవ్ తత్వవాడి ఇతర పాత్రలు పోషించారు. రేణుకా సహానే దర్శకత్వం వహించారు.

ఇది చదవండి: పెళ్లిని మించిన కష్టం లేదు :అజయ్‌ దేవగణ్‌

Last Updated : Jan 15, 2021, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.