విభిన్న పాత్రలు పోషిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం '800'. దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రాజకీయంగా వివాదంలో చిక్కుకుంది. గతంలో ఆయన ఒక వర్గంపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం. ముత్తయ్య మురళీధరన్, విజయ్ సేతుపతి స్టార్ స్పోర్ట్స్ తమిళ్‌లో ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేశారు. మురళీధరన్ పాత్రను ఆయన పోషించబోతుండటం వల్ల తమిళనాడుకు చెందిన అనేక రాజకీయ పార్టీల నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మురళీధరన్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
"నేను జీవితంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నాను. ఇవి నాకు ఇవి కొత్త ఏమీ కాదు. కొన్ని వర్గాల ప్రజలు చిత్రం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని నేను వివరణ ఇవ్వదలచుకున్నాను. నా జీవితం యుద్ధ భూమిలో మొదలైంది. నేను ఏడు సంవత్సరాల వయసులో ఉండగానే నా తండ్రి చనిపోయారు. మా కుటుంబం కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యుద్ధ ప్రాబల్య ప్రాంతంలో ఉంటూ మనుగడ సాగించడానికి అనేక కష్టాలు పడ్డాం. నేను ఈ ఇబ్బందులను ఏ విధంగా ఎదుర్కొన్నాను, క్రికెట్‌లో నిలదొక్కుకొని ఏవిధంగా విజయం సాధించాను అనేది ఈ చిత్రంలో చూపిస్తారు. శ్రీలంకలో తమిళుడిగా జన్మించటం నా తప్పా? నేను శ్రీలంక క్రికెట్ జట్టులో సభ్యుణ్ని. అందువల్ల నేను కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈ చిత్రాన్ని అనేక కారణాల వల్ల రాజకీయం చేస్తున్నారు. నేను మారణ హోమానికి మద్దతు ఇచ్చానని ఆరోపణలు చేస్తున్నారు. నేను 2009లో తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశాను. ఆ వ్యాఖ్యలు ఇప్పటికి నన్ను ఇబ్బందుల్లో నెట్టివేస్తున్నాయి. యుద్ధం 2009లో ముగిసింది. జీవితమంతా యుద్ధం చూసిన వారికి అది ముగియడమనేది మంచి మార్పు. మనం రెండు వైపులా ప్రాణాలు కోల్పోవడం లేదని తెలిసి నేను సంతోషంగా ఉన్నాను. నేను ప్రశాంత జీవితం గడపాలని ఎదురుచూస్తున్నాను. అందరి తమిళుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి నా కథను వెండితెరపై చెప్పాలనుకుంటున్నాను."
- ముత్తయ్య మురళీధరన్, శ్రీలంక దిగ్గజ క్రికెటర్
ఈ సినిమా షూటింగ్ 2021 మొదటి భాగంలో ప్రారంభం కాబోతుంది. అదే సంవత్సరం చివరి నాటికి థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సీ.ఎస్.సామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మలయాళ నటి అయిన రజిశ విజయన్ హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం ఉంది. అన్ని దక్షిణ భారతదేశ భాషలతో పాటు హిందీ, బెంగాళీ, సింహాళీస్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.