కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం '800'. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితాధారంగా రూపొందనుంది. ఈ సినిమా ప్రకటించగానే నెట్టింట నిరసనలు వెల్లువెత్తాయి. "శ్రీలంకలో తమిళులు అణచివేతకు గురవుతూనే ఉన్నారు, ఆ దేశం తరఫున క్రికెట్ ఆడిన వ్యక్తి బయోపిక్‌లో విజయ్ సేతుపతి ఎలా నటిస్తారు?" అంటూ వివాదానికి తెరలేపారు. అంతేకాదు రాజకీయ పరిస్థితుల్ని ఇందులో చూపించబోతున్నారని ప్రచారం సాగింది. తాజాగా ఈ విషయాలపై స్పందించింది చిత్ర బృందం.
-
Press Release! #800TheMovie pic.twitter.com/d0BMYETRi6
— Movie Train Motion Pictures (@MovieTrainMP) October 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Press Release! #800TheMovie pic.twitter.com/d0BMYETRi6
— Movie Train Motion Pictures (@MovieTrainMP) October 14, 2020Press Release! #800TheMovie pic.twitter.com/d0BMYETRi6
— Movie Train Motion Pictures (@MovieTrainMP) October 14, 2020
"800' చిత్రం కేవలం క్రీడా నేపథ్యంలో మాత్రమే తెరకెక్కబోతుంది. ఇందులో రాజకీయానికి సంబంధించిన ఎలాంటి సన్నివేశాలు ఉండవు. ముత్తయ్య క్రీడా ప్రయాణం ఎలా సాగిందో చూపించనున్నాం. కలలు సాకారం చేసుకునే ఎందరికో ఈ చిత్రం స్ఫూర్తిగా నిలుస్తుంది. కళకు సరిహద్దులు లేవు. పాజిటివిటీనే వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నాం" అని నిర్మాణ సంస్థ డార్‌మోషన్ పిక్చర్స్ వెల్లడించింది.