ETV Bharat / sitara

తమన్ ఫుల్​బిజీ.. ఒకేసారి పది సినిమాల కోసం - తమన్ లేటేస్ట్ న్యూస్

సంగీత దర్శకుడు తమన్ పూర్తి బిజీగా ఉన్నారు. ఏకంగా పది సినిమాలకు స్వరాలు సమకూరుస్తున్నారు. మరో ఐదు చర్చల దశలో ఉన్నాయి. రానున్న రోజుల్లో అవి ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.

MUSIC DIRECTOR THAMAN FULL BUSY WITH PLENTY OF CINEMAS IN TOLLYWOOD
తమన్ ఫుల్​బిజీ.. ఒకేసారి పది సినిమాలు కోసం
author img

By

Published : Jan 2, 2021, 9:46 AM IST

Updated : Jan 2, 2021, 10:48 AM IST

'సామజవరగమనా', 'బుట్టబొమ్మా', 'రాములో రాములా' అంటూ అటు క్లాస్‌, ఇటు మాస్‌ ప్రేక్షకుల్ని గతేడాది తన సంగీతంతో అలరించారు సంగీత దర్శకుడు తమన్‌. 'అల వైకుంఠపురములో', 'వకీల్‌సాబ్‌' పాటలతోపాటు 'వి' నేపథ్య సంగీతంతో ఆయన మాంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడిగా ఆయనకు వరుస సినిమా అవకాశాలు వరించాయి. దీంతో ఆయన ఈ ఏడాది మొత్తం రికార్డింగ్స్‌తో పూర్తి బిజీగా మారనున్నారు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం పది ప్రాజెక్ట్‌లు ప్రస్తుతానికి తమన్‌ చేతిలో ఉన్నాయి. అంతేకాకుండా మరో ఐదు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమన్‌ చేతిలో ఉన్న కీలకమైన కొన్ని ప్రాజెక్ట్‌ల గురించే ఈ స్టోరీ.

తమన్‌ సాబ్‌కు ఇది కీలకం..

తమన్‌ చేతిలో ఉన్న సినిమాల్లో ఓ కీలకమైన ప్రాజెక్ట్‌ 'వకీల్‌సాబ్‌'. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ రీఎంట్రీ సినిమా కావడం వల్ల దర్శక నిర్మాతలతోపాటు సంగీత దర్శకుడిపై కూడా ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి. ప్రేక్షకుల్ని అలరించేలా పాటల్ని అందించడం కోసం తమన్‌ ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మగువా మగువా' పాట సినీ ప్రియుల్ని ఆకర్షించింది.

vakeelsaab pawan thaman
వకీల్​సాబ్​ చిత్రంలో పవన్​కల్యాణ్

సర్కారు కోసం ఎలాంటి పాటలిస్తారో..

దాదాపు ఆరేళ్ల తర్వాత మహేశ్‌బాబు-తమన్‌ కాంబోలో రానున్న చిత్రం 'సర్కారువారి పాట'. 'దూకుడు', 'ఆగడు' తర్వాత మహేశ్‌ కోసం ఆయన కంపోజ్‌ చేస్తున్న చిత్రమిదే. సంగీతపరంగా సూపర్‌స్టార్‌ అభిమానుల పల్స్‌ తెలుసుకున్న తమన్‌ ఈ సినిమా కోసం అద్భుతమైన‌ ట్యూన్స్‌ అందించడానికి సిద్ధమవుతున్నారు.

sarkar vaari paata mahesh babu thaman
సర్కారు వారి పాట సినిమాలో మహేశ్​బాబు

మాస్‌ కోసం ప్రత్యేకంగా..

'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ', 'డిస్కోరాజా' కోసం మాస్‌ మహారాజ్‌ రవితేజతో కలిసి పనిచేసిన తమన్‌ 'క్రాక్‌'తో మాస్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ క్రేజ్‌కు అనుగుణంగా ఆయన ఈ స్వరాలు సమకూర్చారు. 'భూమ్‌ బద్దల్‌', 'కోరమీసం పోలీసోడా' పాటలు విడుదలైన నాటి నుంచి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించాయి.

raviteja krack thaman
క్రాక్​ లో రవితేజ

రీమేక్‌ ఎలా ఉంటుందో..

తమన్‌ కెరీర్‌లో మరో కీ ప్రాజెక్ట్‌ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌. మలయాళంలో సూపర్‌హిట్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రీమేక్‌లో పవన్‌కల్యాణ్‌-రానా నటిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా తమన్‌ను ఎంపిక చేశారు.

pawan rana cinema thaman
పవన్ కల్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్

ఈలలు వేయిస్తారా..!

నందమూరి బాలకృష్ణ సినిమాలో డైలాగ్‌లతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రానికి తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. బీబీ3 ఫస్ట్‌ గ్లిమ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాస్‌ ప్రియుల్ని మెప్పించింది.

balakrishna thaman movie
బోయపాటి సినిమాలో బాలకృష్ణ

ఈ ఐదు కీ ప్రాజెక్ట్‌లతో పాటు వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్తచిత్రం(VT10), నాని 'టక్‌ జగదీశ్‌', పునీత్‌ రాజ్‌కుమార్‌ 'యువరత్న', శింబు 'ఈశ్వరన్‌' (తమిళ ప్రాజెక్ట్‌), పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ 'కదువ' (మలయాళీ ప్రాజెక్ట్‌) సినిమాలకు తమన్‌ స్వరాలు అందించనున్నారు.

Last Updated : Jan 2, 2021, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.