ETV Bharat / sitara

ఇంట్లో ఉండండి బాబూ.. ఇంట్లో ఉండండి! - కరోనా పై సంగీతం

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు తమ వంతు ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటీవలే సంగీత దర్శకుడు ఎమ్​ఎమ్​ కీరవాణి కరోనాపై ఓ గీతాన్ని రూపొందించాడు. తాజాగా మరో పాటల రచయిత అనంతశ్రీరామ్​ ఈ వైరస్​పై గీతాన్ని అందించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

Music director Ananth Sriram sing a song on Corona Virus
కలిసి మెలిసి తిరగకండి... ఇంట్లోనే ఉండండి... కరోనా
author img

By

Published : Apr 4, 2020, 7:22 AM IST

Updated : Apr 4, 2020, 10:35 AM IST

సామాజిక బాధ్యత విషయంలో తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ముందుంటుంది. సమాజానికి ఏ కష్టం ఎదురైనా సరే.. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి 'నేనున్నా' అంటూ ముందుకొస్తుంది. ఆర్థికంగా సహాయం చేస్తూ ఆదుకునే సినీ ప్రముఖులు కొంతమంది. కవులు, కళాకారులైతే జనాన్ని జాగృతం చేస్తూ మరింత ధైర్యాన్ని నూరిపోస్తుంటారు. మహమ్మారి కరోనా విషయంలో తెలుగు సినీ రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు విశేషంగా స్పందిస్తున్నారు. తమ పాటలతో సామాన్యుడిలో అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. గీత రచయిత అనంతశ్రీరామ్‌, సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌, సంగీత వాయిద్యకారుడు సాయి తదితరులు కలిసి 'ఇంట్లో ఉండండి' అంటూ ఒక పాటని రూపొందించారు. 'కలరాని కాల్చేశాం, మశూచిని మసి చేశాం' అంటూ గీత రచయిత చంద్రబోస్‌, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకులు వాసూరావు కలిసి మరో పాటని సిద్ధం చేశారు. ఈటీవీ నిర్మాణంలో రూపొందిన ఈ పాటల ప్రయాణం గురించి గీత రచయితలు, సంగీత దర్శకులు ‘ఈనాడు సినిమా’తో చెప్పిన విషయాలివీ...

రచన: అనంతశ్రీరామ్‌

గానం, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌

కీబోర్డ్‌: సాయి

పల్లవి:

క..క..క రో..రో..రో

నా..నా..నా

కరోనా కరోనా

క..క..క

కలిసి మెలిసి తిరగకండి

రో..రో..రో

రోడ్లమీద నడవకండి

నా..నా..నా

నాలుగువారాలపాటు

ఇంట్లో ఉండండి

అమ్మా ఇంట్లో ఉండండి

ఇంట్లో ఉండండి

అయ్యా ఇంట్లో ఉండండి

చరణం: 1

కూరగాయ లేకపోతేం

ఊరగాయ ఉంటది

పాలు పెరుగు లేకపోతేం

పప్పుముద్ద ఉంటది

ప్రాణమే లేకపోతే ఏముంటాది

ఇంట్లో ఉండండి

అత్తా ఇంట్లో ఉండండి

ఇంట్లో ఉండండి

మావా ఇంట్లో ఉండండి

చరణం: 2

పగలు రేయి పనిచేసే

నర్సుకి బరువవ్వక

నిద్రలేని పోలీసు

లాఠీలకు పనిచెప్పక

చెడ్డ మహమ్మారితోటి చెలగాటలాడక

ఇంట్లో ఉండండి

అన్నా ఇంట్లో ఉండండి

ఇంట్లో ఉండండి

తమ్మీ ఇంట్లో ఉండండి

చరణం: 3

లక్షలుగా కదలిరండి

అనేదపుడు ఉద్యమం

ఒక్కడైన కదలకండి

అన్నది నేటి ఉద్యమం

దూరంపాటించి చెడుని

దూరంగా తరమండి

ఇంట్లో ఉండండి

బిడ్డా ఇంట్లో ఉండండి

ఇంట్లో ఉండండి

బాబూ ఇంట్లో ఉండండి

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"కరోనా నిర్మూలన గురించి మొదట్లో చేతులు కడుక్కోవడం, శారీరక శుభ్రత ప్రధానంగా చెప్పారు. ఆ తర్వాత నుంచి సామాజిక దూరం గురించి చెప్పడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం సామాజిక దూరం పాటించిదో ఆ దేశం కరోనామీద విజయం సాధిస్తూ వచ్చింది. ఉదాహరణకు దక్షిణ కొరియా. అందుకే మనం ఆ విషయాన్ని ప్రధానంగా చెప్పాలనుకున్నా. సామాన్యుడిఅర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో ఈ పాట రాయడం మొదలుపెట్టా. క అంటే కలిసిమెలసి తిరగకండి, రో అంటే రోడ్లమీద నడవకండి, నా అంటే నాలుగు వారాల పాటు ఇంట్లో ఉండండంటూ పల్లవిని రాశా. ఇంట్లో ఉండాలని చెప్పాక, ఎదురయ్యే చిక్కుల్నీ ప్రస్తావించాలి కదా! కూరగాయ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఇంట్లో ఉన్న ఊరగాయతో, పప్పు ముద్దతో సర్దుకోవాలని మొదటి చరణంలో చెప్పా. మన కోసం కష్టపడే వైద్యులు, పోలీసు యంత్రాంగం సేవల్ని ప్రస్తావిస్తూ చరణం రాశా. రెండో చరణంలో ఉద్యమం గురించి చెప్పా. ఈ పాట సారాంశం మొత్తాన్ని చెప్పేందుకు ఒక సంతకంలాగా చివరి పంక్తుల్ని రాశా. జానపద పోకడలున్న గీతం కాబట్టి, ఇలాంటి గీతాలకి ప్రజాగాయకులైతే బాగుంటుందని ఈటీవీ బృందం వందేమాతరం శ్రీనివాస్‌ గారిని సంప్రదించగానే ఆయన పాడి ఇచ్చారు. ఆయన గొంతు ద్వారా రావడంతో ఈ పాట ప్రజలకి ఇంకా దగ్గరైంది".

-అనంతశ్రీరామ్‌

ఇదీ చూడండి : కీరవాణి నోట కరోనా పాట... నెట్టింట వైరల్​

Last Updated : Apr 4, 2020, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.