ETV Bharat / sitara

స్టార్ హీరోలు ఆ బాధ్యత తీసుకోవాలి: మురళీమోహన్ - Murali mohan telugu movie news

ఆదివారం(అక్టోబరు 10) జరిగే 'మా' ఎన్నికల గురించి.. దాని మాజీ అధ్యక్షుడు మురళీమోహన్​ మాట్లాడారు. అధ్యక్ష పదవికి ఇద్దరూ సమర్ధులేనని అన్నారు.

murali mohan
మురళీమోహన్
author img

By

Published : Oct 8, 2021, 9:57 PM IST

Updated : Oct 9, 2021, 9:47 AM IST

మురళీమోహన్ ఇంటర్వ్యూ

ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు సినీ పరిశ్రమలో ప్రాంతీయవాదం తగ్గాలంటే ఆ బాధ్యతను అగ్ర హీరోలు తమ భుజాన ఎత్తుకోవాలని ప్రముఖ సీనియర్ నటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు మురళీమోహన్ కోరారు. స్థానిక కళాకారులను ప్రోత్సహించి నిర్మాతల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత హీరోలు తీసుకోవాలని సూచించారు.

అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షులుగా పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులపై తన అభిప్రాయాన్ని ఈటీవీతో పంచుకున్నారు మురళీమోహన్. అధ్యక్ష పదవికి ఇద్దరు సమర్థులేనని అన్నారు. ఎవరు గెలిచినా 'మా' అసోసియేషన్ భవనంతోపాటు సభ్యుల సంక్షేమం కోసం పట్టుదలతో కష్టపడాలని చెప్పారు.

ఈ ఎన్నికను ఏకగ్రీవం చేద్దామని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా ప్రయత్నించినా అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వల్ల ఎన్నికల తప్పలేదని మురళీమోహన్​ చెప్పారు. ఈ క్రమంలోనే సభ్యులంతా రెండు ప్యానెల్స్​లో ఉన్న సభ్యుల పనితీరును గమనించి ఎన్నుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 9, 2021, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.