ముంబయి తీరంలోని విహారనౌకలో జరిగిన రేవ్‌పార్టీలో(Mumbai Rave Party) డ్రగ్స్ వినియోగం, విక్రయం వ్యవహారంలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా మొత్తం 8 మందిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి(Aryan Khan Arrest) తీసుకున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆర్యన్, అర్బాజ్, మున్‌మున్‌లను అరెస్ట్‌చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం సోమవారం ఒకరోజు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది.
అక్టోబరు 7 వరకు..
కస్టడీ ముగియటం వల్ల.. ఇవాళ ఆర్యన్‌తోపాటు ముగ్గుర్ని కోర్టులో ప్రవేశపెట్టిన ఎన్సీబీ అధికారులు.. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు సంబంధాలు ఉన్నందున నిందితుల కస్టడీ పొడిగించాలని కోరారు. ఈనెల 11వరకు కస్టడీకి ఇవ్వాలని ఎన్సీబీ కోరింది. ఇరువర్గాల మధ్య వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. డ్రగ్స్‌వాడిన వారిని ప్రశ్నించకపోతే.. ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎవరు ఫైనాన్సింగ్ ఎవరు చేస్తున్నారో ఎలా తెలుస్తుంగని ఎన్సీబీ తరఫు న్యాయవాది అన్నారు. అన్ని ఆధారాలు ఉన్నందున నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. డ్రగ్స్ కుట్ర ఛేదించాలంటే నిందితుల కస్టడీ అవసరమని.. డ్రగ్స్‌వల్ల యువత దారుణంగా ప్రభావితమవుతోందంటూ ఆయన వాదించారు. రేవ్‌పార్టీ నిర్వాహకులనూ విచారించాల్సి ఉందన్నారు.
ఆర్యన్ దగ్గర డ్రగ్స్ లేవు
మరోవైపు ఎన్సీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్‌దొరకలేదని ఆయన తరఫు న్యాయవాది సతీష్ మన్ షిండే పేర్కొన్నారు. వాట్సాప్ చాట్‌లో నేరపూరితమైన సాక్ష్యాలు, అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌తో సంబంధాల ఆరోపణలపై స్పందించిన ఆర్యన్‌తరఫు న్యాయవాది.. తన క్లయింట్‌పై ఎన్సీబీ తీవ్రమైన అభియోగాలు మోపుతోందన్నారు. డ్రగ్ సిండికేట్‌తో సంబంధాలకు ఎలాంటి ఆధారాల్లేవన్నారు. అందువల్ల బెయిల్ ఇవ్వాలని కోరగా.. న్యాయస్థానం అందుకు నిరాకరించింది.
ఎవరి వద్ద ఎంతెంత డ్రగ్స్..
ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టేందుకు ఎన్సీబీ బృందం ముంబయిలోని ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ వద్దకు చేరుకుంది. శనివారం రోజున ఎన్సీబీ అధికారులు దాడులు జరిపినప్పుడు ఆ నౌకలో ఉన్న ప్రయాణికులను సైతం విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. క్రూజ్ రేవ్‌పార్టీలోని డ్రగ్స్ వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ సహా మొత్తం ఎనిమిది మంది నిందితులను ఎన్సీబీ అధికారులు నిన్న మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఆర్యన్, అర్బాజ్, దామేచాపై ఎన్డీపీఎస్ చట్టం కింద అధికారులు కేసులు నమోదు చేశారు. అయితే, ఎవరెవరి నుంచి ఎంత మోతాదులో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని కోర్టు ప్రశ్నించగా.. అర్బాజ్ మర్చంట్ నుంచి 6 గ్రాములు, మూన్‌మూన్ దమేచా నుంచి 5 గ్రాములు చొప్పున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ తెలిపినట్టు సమాచారం.
ఇదీ చూడండి.. Drugs Case News: ఆర్యన్‌తో ఫోన్లో మాట్లాడిన షారుక్