ETV Bharat / sitara

హృతిక్ రోషన్​​కు ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ సమన్లు - హృతిక్​ రోషన్​కు సమన్లు

స్టార్​ హీరో హృతిక్​ రోషన్​కు ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు సమన్లు జారీ చేశారు. గతంలో నటి కంగనా రనౌత్​పై నమోదు చేసిన నకిలీ ఈ-మెయిల్​ కేసులో భాగంగా హృతిక్​ నోటీసులు అందించనట్లు పోలీసులు తెలిపారు.

Mumbai police likely to summon Hrithik Roshan in imposter case
కంగనపై ఈ-మెయిల్​ కేసులో హృతిక్​కు సమన్లు
author img

By

Published : Feb 26, 2021, 7:12 AM IST

Updated : Feb 26, 2021, 8:48 AM IST

బాలీవుడ్​ హీరో హృతిక్​ రోషన్​కు ముంబయి నేర విభాగ పోలీసులు సమన్లు జారీ చేశారు. గతంలో నటి కంగనా రనౌత్​ నమోదు చేసిన ఈ-మెయిల్​ కేసులో భాగంగా నోటీసులు అందించినట్లు.. ఫిబ్రవరి 27న హృతిక్​ వాంగ్మూలాన్ని స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. కంగన నకిలీ ఖాతా నుంచి తనకు బెదిరింపు మెయిళ్లొచ్చాయని 2016లో హృతిక్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ సమయంలో కంగన, హృతిక్​ మధ్య వివాదం చెలరేగింది. ఒకరికొకరు లీగల్​ నోటీసులిచ్చుకున్నారు. గతేడాది డిసెంబరులో హృతిక్ న్యాయవాది అభ్యర్థన మేరకు సైబర్​ విభాగం నుంచి నేర విభాగానికి ముంబయి పోలీసులు బదిలీ చేశారు.

అసలు ఏం జరిగిందంటే?

హృతిక్​, తనకు మధ్య ప్రేమయాణం నడిచినట్లు కంగన బహిరంగంగానే చాలా సార్లు చెప్పింది. అతడు తనను మోసం చేశాడని పలుసార్లు విమర్శించింది. ఇదిలా ఉండగా.. 2016లో కంగన పేరుతో నకిలీ మెయిల్​ ఖాతా నుంచి తనకు వందల కొద్దీ మెసేజ్​లు, మెయిల్స్​ వస్తున్నాయని సైబర్​ పోలీసులను ఆశ్రయించాడు హృతిక్. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు అప్పటి నుంచి ఆ కేసును దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అయినా ఈ సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం దీనిని క్రైమ్​ బ్రాంచ్​కు తరలించారు.

ఇదీ చూడండి: "క్షణక్షణం' క్లైమాక్స్​ ఎవరూ ఊహించలేరు'

Last Updated : Feb 26, 2021, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.