ETV Bharat / sitara

త్వరలో తలైవా కొత్త చిత్రం! కేజీఎఫ్​-2 క్రేజీ అప్​డేట్ - రవీనా టాండన్

Movie Updates: సినీ అభిమానులకు ఆసక్తి కలిగించే కొన్ని బడా సినిమాల అప్​డేట్స్​ వచ్చేశాయి. ఇందులో ప్రేక్షకులు ఎంతగానో వేచిచూస్తున్న 'కేజీఎఫ్​ 2' సహా సూపర్​స్టార్​ రజనీకాంత్​, అజిత్​ చిత్రాల సంగతులు ఉన్నాయి.

Movie Updates:
త్వరలో తలైవా కొత్త చిత్రం! కేజీఎఫ్​-2 క్రేజీ అప్​డేట్
author img

By

Published : Feb 8, 2022, 4:34 PM IST

Movie Updates: గతేడాది నవంబరులో 'అన్నాత్తే' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు తమిళ సూపర్​స్టార్​ రజినీకాంత్​. పెద్దన్న పేరుతో ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై అలరించింది. ఈ చిత్రం రిలీజ్​ తర్వాత స్వల్ప విరామం తీసుకున్న తలైవా.. తాజాగా తన 169వ చిత్రానికి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం.

దర్శకుడు నెల్సన్​ దిలీప్​కుమార్​తో ఈ సినిమా చేస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. బలమైన కథతో పాటు ఆకట్టుకునే స్క్రీన్​ప్లేతో ఈ సినిమా తెరకెక్కించనున్నారని చెప్పుకొచ్చాయి. ఏప్రిల్​ నెలాఖరు లేదా మే మొదటివారంలో ఈ సినిమా షూటింగ్​ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపాయి. ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్​ అవుతుందని పేర్కొన్నాయి.

ఈ కాంబినేషన్​లో చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కేజీఎఫ్​-2

ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో కన్నడ స్టార్​ యశ్​​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'కేజీఎఫ్​ 2'. ఈ చిత్రం తొలిభాగం 2018లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్​లో విడుదల కానున్న రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్​డేట్​ వచ్చేసింది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్​ యాక్టర్​ రవీనా టాండన్​ తన వంతు డబ్బింగ్​ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్​​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది.

Movie Updates
దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో రవీనా టాండన్
movie updates
రవీనా టాండన్

ఆ దర్శకుడితో మరోసారి

'వలిమై'తో ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న కోలీవుడ్​ స్టార్​ నటుడు అజిత్​ మరో సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. 'ఏకే 61' అనే తాత్కాలిక టైటిల్​తో ఈ చిత్రం బుధవారం హైదరాబాద్​లో ప్రారంభం కానుంది. 'వలిమై' చిత్ర దర్శకుడు హెచ్​.వినోద్​ ఈ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో టాలీవుడ్​ హీరో నాగార్జున.. అజిత్​తో కలిసి నటించనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి : Ravi Teja Khiladi: 'హాలీవుడ్‌ స్థాయిలో రవితేజ 'ఖిలాడి''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.