ETV Bharat / sitara

'మిషన్​ 2020'పై నిర్మాతల ధీమా.. థ్రిల్లింగ్ 'అగోచర' - మూవీ అప్డేట్స్ లేటేస్ట్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో మిషన్ 2020, మనుచరిత్ర, అగోచర చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates Mission 2020, Manu charitra, Agochara
'మిషన్​ 2020'పై నిర్మాతల ధీమా.. థ్రిల్లింగ్ 'అగోచర'
author img

By

Published : Feb 19, 2021, 6:59 AM IST

*నవీన్ చంద్ర కథానాయకుడిగా కరణం బాబ్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మిషన్ 2020'. నాగబాబు, జయ ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 5న విడుదలవుతోంది. "సమాజానికి కావాల్సిన మంచి సందేశంతో నిర్మించాం. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం" అని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

*శివ కందుకూరి, మేఘా ఆకాష్, ప్రియ వడ్లమాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మను చరిత్ర'. భరత్ పెదగాని దర్శకుడు. రాన్సన్ జోసెఫ్ నిర్మాత. నటి కాజల్ అగర్వాల్ సమర్పిస్తోంది. లవ్ యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వరంగల్ నేపథ్యంగా సాగనున్నట్లు తెలుస్తోంది.

movie updates Mission 2020, Manu charitra, Agochara
మను చరిత్ర సినిమాలో శివ కందుకూరి

*కమల్ కామరాజు, ఇషా చావ్లా జంటగా నటిస్తున్న చిత్రం 'అగోచర'. కబీర్‌లాల్ దర్శకుడు. స్పానిష్ థ్రిల్లర్ 'జూలియా ఐస్' స్ఫూర్తితో రూపొందుతోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్​లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నారు. ఇందులో ఇషా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. తెలుగుతో పాటు తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ విడుదల కానుందీ సినిమా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.