>నేచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగరాయ్' సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఈ నెల నుంచే షూటింగ్ ప్రారంభించనున్నారు.
>విజయ్ సేతుపతి, సమంత, నయనతారల సినిమా 'కాత్తువక్కుల రెండు కాదల్'.. పూజా కార్యక్రమం, షూటింగ్ గురువారమే మొదలైంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.
>'అంతిమ్' సినిమాలో హీరో సల్మాన్‌ఖాన్ ఫస్ట్‌లుక్ వీడియో విడుదలైంది. ఇందులో సల్మాన్ సిక్కు పోలీస్‌గా నటిస్తున్నారు. ఆయుష్ శర్మ కథానాయకుడు. మహేశ్ మంజ్రేకర్ దర్శకుడు.
>బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న 'బాబ్ బిశ్వాస్' షూటింగ్ ముగిసింది. కోల్‌కతాలో ఒకే షెడ్యూల్లో 43 రోజుల్లోనే దీనిని పూర్తి చేయడం విశేషం. చిత్రాంగద సింగ్ హీరోయిన్. దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలు.
> సాయిధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' టైటిల్ గీతం.. శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. డిసెంబరు 25న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
>రవితేజ 'క్రాక్' చిత్రంలోని రెండో గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ పాడారు. దీనిని ఈనెల 14న విడుదల చేయనున్నారు.
>సుశాంత్.. తాను నటించిన 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాకు డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
>శ్రీనివాసరెడ్డి, సప్తగిరి హీరోగా 'హౌస్ అరెస్టు' టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. గురువారం దీనిని లాంఛనంగా ప్రారంభించారు. దర్శకుడు బాబీ క్లాప్ కొట్టారు.








