నేచురల్ స్టార్ నాని.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరోసారి నటించనున్నారు. శుక్రవారం ఉదయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 'రాజారాణి' ఫేమ్ నజ్రియా.. ఈ చిత్రంతోనే తెలుగులోకి పరిచయమవుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ సినిమా టైటిల్‌ను నవంబరు 21న విడుదల చేయనున్నారు.
![nani nazriya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9531086_movie-1.jpg)
![nazriya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9531086_movie-124.jpg)
దగ్గుబాటి రానా.. చాలా నెలల విరామం తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు.
![rana hero](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9531086_movie-2.jpg)
కోలీవుడ్ ప్రముఖ హీరో ధనుష్ నటిస్తున్న 'జగమే తంత్రం'లోని బుజ్జి పాట విడుదలైంది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా 'విజయ్ రాఘవన్'. శుక్రవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని తీసుకురానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.
![vijay antony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9531086_movie-3.jpg)