ETV Bharat / sitara

దసరాకు 'మైదాన్'.. 'గువ్వ గోరింక' ట్రైలర్​తో సత్యదేవ్ - kothi kommachchi movie shooting completed

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'మైదాన్' రిలీజ్ డేట్, 'కోతి కొమ్మచ్చి' షూటింగ్ పూర్తి, 'రెడ్' సినిమా పాట ప్రోమోతో పాటు పలు చిత్రాల కబుర్లు ఉన్నాయి. అవేంటో చూసేయండి మరి.

movie updates from maidaan, ram red, guvva gorinka, kothi kommachchi, odela railway station, shaakunthalam etc..
దసరాకు 'మైదాన్'.. 'గువ్వ గోరింక' ట్రైలర్​తో సత్యదేవ్
author img

By

Published : Dec 12, 2020, 4:04 PM IST

*బాలీవుడ్​ స్టార్ అజయ్ దేవగణ్​ 'మైదాన్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది దసరా కానుకగా అక్టోబరు 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 65 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏప్రిల్​లో చివరి షెడ్యూల్​ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం వీఎఫ్​ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఫుట్​బాల్ నేపథ్య కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

*'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' ఫేమ్ సాయి స్వరూప్ దర్శకత్వంలో కొత్త సినిమా శనివారం లాంఛనంగా మొదలైంది. 'మిషన్ ఇంపాజిబుల్' టైటిల్​తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ముగ్గురు చిన్నారులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్​లుక్​ను కూడా విడుదల చేశారు.

*స్టార్ డైరెక్టర్​ గుణశేఖర్ రూపొందిస్తున్న 'శాకుంతలం' సినిమా.. ప్రీ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది. ఓ అజారమరమైన ప్రేమకథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్​లో వీడియోలు పోస్ట్ చేశారు.

*'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగేశ్న కొత్త సినిమా 'కోతి కొమ్మచ్చి'. కేవలం నెలలోనే షూటింగ్​ అంతా పూర్తి చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో మేఘాంశ్ ఆకాశ్, సామ్ వేగేశ్న, రిద్ది కుమార్, మేఘా చౌదరి హీరోహీరోయిన్లు. రాజేంద్ర ప్రసాద్, నరేశ్ కీలక పాత్రలు పోషించారు.

*సత్యదేవ్, ప్రియాలాల్ ప్రధాన పాత్రల్లో నటించిన 'గువ్వ గోరింక' ట్రైలర్ విడుదలైంది. సంగీతమంటే ఇష్టపడే అమ్మాయికి, అసలు అదంటేనే పడని ఓ అబ్బాయి మధ్య ప్రేమకథే ఈ సినిమా. ఈనెల 17న అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

*రామ్​ 'రెడ్' సినిమాలో ఓ పాట ప్రోమో విడుదలైంది. 'కౌన్ హై అచ్చా.. కౌన్ హై లుచ్చా' అంటూ సాగే పూర్తి గీతం.. ఆదివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. త్వరలో చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.

*'ఓదెల రైల్వేస్టేషన్​' సినిమాలోని స్ఫూర్తి పాత్రలో పూజిత పొన్నాడ నటిస్తోంది. శనివారం ఆమె ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హెబ్బా పటేల్​ ప్రధాన పాత్రలో కనిపించనుంది.

maidaan release date
అక్టోబరు 15న మైదాన్ సినిమా విడుదల
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

mishan impossible movie launch
మిషహన్ ఇంపాజిబుల్ చిత్ర ప్రారంభోత్సవం
mishan impossible movie
దర్శకుడు సాయి స్వరూప్ కొత్త సినిమా పోస్టర్​
kothi kommachchi movie shooting completed
కోతి కొమ్మచ్చి షూటింగ్ పూర్తి
kothi kommachchi
కోతి కొమ్మచ్చి చిత్రంలో రాజేంద్రప్రసాద్, నరేశ్
odela railway station poojitha ponnada
ఓదెల రైల్వేస్టేషన్​లో పూజిత పొన్నాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.