>'కేజీఎఫ్ 2' క్లైమాక్స్ షూటింగ్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. సెట్లో ఫైట్ మాస్టర్స్‌తో కలిసి తీసుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో రాకీగా యష్, అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. దీని తర్వాత ప్రభాస్‌తో కలిసి పనిచేయనున్నారు ప్రశాంత్ నీల్.
>ప్రేమకథతో తెరకెక్కుతోన్న 'మహాసముద్రం' షూటింగ్ ప్రారంభమైంది. సిద్ధార్థ్ సెట్లోకి అడుగుపెట్టారు. అందుకు సంబంధించిన ఫొటోల్ని పోస్ట్ చేసిన చిత్రబృందం.. ఈ విషయాన్ని వెల్లడించింది. శర్వానంద్, సిద్ధార్థ్, అదితీ రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు.
>రామ్‌గోపాల్ వర్మ 'కరోనా' సినిమా.. డిసెంబరు 11న థియేటర్లతో పాటు ఏటీటీలోనూ విడుదల కానుంది. దీనికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్లు భయపెడుతూనే ఆసక్తి కలిగిస్తున్నాయి.
>గోవాలో షూటింగ్ జరుపుకొంటున్న 'క్రాక్' బృందం.. సమయాన్ని ఆస్వాదిస్తోంది. హీరోహీరోయిన్లు రవితేజ, శ్రుతిహాసన్.. ప్లాంక్స్ చేయడంలో పోటీపడ్డారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
>ఇటీవల ఓటీటీలో విడుదలై హిట్‌గా నిలిచిన సూర్య 'ఆకాశం నీ హద్దురా!'.. 25 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అపర్ణ బాలమురళి హీరోయిన్, సుధా కొంగర దర్శకత్వం వహించారు. జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు.
>బాలీవుడ్ నటి రిచా చద్దా ప్రధాన పాత్రలో నటించిన 'షకీలా' నుంచి మరో పోస్టర్ విడుదలైంది. 'ద సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్' పాత్రలో పంకజ్ త్రిపాఠి నటించారు. డిసెంబరు 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
![kgf 2 prasanth neel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9795331_movbies-5.jpg)
![maha samudram shooting kick starts](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9795331_movbies-3.jpg)
![mahasamudram first look poster](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9795331_movbies-4.jpg)
-
Mass Maharaj @RaviTeja_offl and gorgeous @shrutihaasan doing Plank challenge on the sets of #Krack. @megopichand @MusicThaman @varusarath5 @thondankani @TagoreMadhu @ramjowrites@dop_gkvishnu @LahariMusic #Raviteja #Krackified pic.twitter.com/iUj99bZI26
— RaviTeja Flicks (@RaviTejaFlicks) December 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mass Maharaj @RaviTeja_offl and gorgeous @shrutihaasan doing Plank challenge on the sets of #Krack. @megopichand @MusicThaman @varusarath5 @thondankani @TagoreMadhu @ramjowrites@dop_gkvishnu @LahariMusic #Raviteja #Krackified pic.twitter.com/iUj99bZI26
— RaviTeja Flicks (@RaviTejaFlicks) December 7, 2020Mass Maharaj @RaviTeja_offl and gorgeous @shrutihaasan doing Plank challenge on the sets of #Krack. @megopichand @MusicThaman @varusarath5 @thondankani @TagoreMadhu @ramjowrites@dop_gkvishnu @LahariMusic #Raviteja #Krackified pic.twitter.com/iUj99bZI26
— RaviTeja Flicks (@RaviTejaFlicks) December 7, 2020
![corona virus movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9795331_movbies-6.jpg)
![aakasham nee haddhura movie completes 25 days](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9795331_movbies-2.jpg)
![pankaj tripathi in shakeela cinema](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9795331_movbies-1.jpg)
![krack movie team in goa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9795331_movbies-9.jpg)
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9795331_movbies-8.jpg)