*అక్షయ్ కుమార్ యాక్షన్ డ్రామా 'బచ్చన్ పాండే' విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా దీనిని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఫరాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లు.
![Akshay Kumar's 'Bachchan Pandey'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10352555_movie-1.jpg)
*శర్వానంద్ హీరోగా నటిస్తున్న శ్రీకారం రిలీజ్ డేట్ ఫిక్సయింది. శివరాత్రి కానుకగా మార్చి 11న తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. కిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
![sharwanand sreekaram movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10352555_movie.jpg)
*బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా.. కొత్త సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. తనతో 'ఆర్టికల్ 15' లాంటి అద్భుత చిత్రం తీసిన అనుభవ్ సిన్హాతో కలిసి మరోసారి పనిచేయనున్నారు. స్పై థ్రిల్లర్ కథతో దీనిని తెరకెక్కించనున్నారు.
![ayushman khurrana next movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/74941120_565879550879013_7757590563020855725_n_2301newsroom_1611387208_471.jpg)
*సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఇదే మా కథ' సినిమా టీజర్.. ఈనెల 25న సాయంత్రం విడుదల కానుంది. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేశ్ గొల్ల నిర్మిస్తున్నారు.
![idhe maa katha teaser](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10352555_movie-2.jpg)
![saidharam tej movie news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10352555_cinema-2.jpg)
![raviteja khiladi movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10352555_cinema-3.jpg)
![vasanth kokila teaser](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10352555_cinema-1.jpg)