ETV Bharat / sitara

ప్రభాస్​ కోసం మెహ్రీన్​.. వెబ్​సిరీస్​లో నాగ్​! - మెహ్రీన్​ కొత్త సినిమా

Movie Updates: యంగ్​రెబల్​ స్టార్ ప్రభాస్​​ కొత్త చిత్రంపై మరో అప్​డేట్​ వచ్చింది. మరోవైపు కింగ్​ నాగార్జున వెబ్​సిరీస్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇలా ఇంకా మరెన్నో ఆసక్తికర అప్​డేట్స్​ ఉన్నాయి.

mehreen pirzada
మెహ్రీన్
author img

By

Published : Feb 9, 2022, 4:16 PM IST

Movie Updates: 'కృష్ణగాడి వీరప్రేమగాథ'లో నటించి తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసిన పంజాబీ బ్యూటీ.. మెహ్రీన్​. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో ఆమెకు హిట్​ దొరకలేదు. ప్రస్తుతం కెరీర్​ బ్రేక్​ కోసం ఎదురుచూస్తున్న మెహ్రీన్ బంపర్​ ఆఫర్​ కొట్టేసింది. పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ సరసన నటించేందుకు అవకాశం దక్కినట్లు సమాచారం. ప్రభాస్​ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో యంగ్​రెబల్​ స్టార్​కు జోడీగా మెహ్రీన్​ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'రాజాడీలక్స్​' అనే టైటిల్​ ఖరారు చేసినట్లు సమాచారం. మారుతీ దర్శకత్వంలో మెహ్రీన్​ ఇప్పటికే 'మాహానుభావుడు', 'మంచిరోజులు వచ్చాయి' చిత్రాల్లో నటించింది.

వెబ్​సిరీస్​లోకి ఎంట్రీ..

కొత్తదనానికి ప్రాధాన్యం ఇచ్చే కింగ్​ నాగార్జున.. ఇప్పుడు వెబ్​సిరీస్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు, యువహీరో నాగచైతన్య.. విక్రమ్​ కే కుమార్​ దర్శకత్వంలో ఓ వెబ్​సిరీస్​ చేసేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్​ స్టార్​ కోసం రూపొందే ఓ వెబ్​సిరీస్​లో నటించేందుకు నాగ్​ ఓకే చెప్పేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్​ సత్తారు దర్శత్వంలో తెరకెక్కుతున్న 'ది ఘోస్ట్​' చిత్రంలో నటిస్తున్నారు.

భారీ ఆఫర్​..

శర్వానంద్​ హీరోగా తెరకెక్కిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్​ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథనాయికగా రష్మిక మందన నటించింది. ఈనెల 25న విడుదల కానున్న ఈ చిత్రంపై తాజా అప్​డేట్​ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం నాన్​ థియేట్రికల్​ రైట్స్​ రూ. 25 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా సంగీత హక్కుల్ని​ లహరీ మ్యూజిక్​ కొనుగోలు చేయగా.. శాటిలైట్​, డిజిటల్​ హక్కులను సోనీ గ్రూప్​ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : చిరు రీఎంట్రీ.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ప్రకటనల్లో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.