ETV Bharat / sitara

సోషల్ వాచ్: తళుక్కుమంటోన్న 'తార'ల విశేషాలు - మహేశ్​ బాబు

సినీతారలు సామాజిక మాధ్యమాల వేదికగా తమ విశేషాలను పంచుకున్నారు. కొందరు.. తాము ప్రస్తుతం నటిస్తోన్న సినిమా విశేషాలను చెబుతుంటే, మరికొందరు.. తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న పోటోలను షేర్​ చేశారు.

movie stars
తళుక్కుమంటోన్న 'తార'ల విశేషాలు
author img

By

Published : Nov 8, 2020, 10:02 PM IST

కథానాయకుడు మహేశ్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్‌కు వెళ్లారు. కరోనా నేపథ్యంలో అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రయాణం చేస్తున్నామంటూ మహేశ్‌ ఫొటో షేర్‌ చేశారు.

నటులు బ్రహ్మాజీ, రవిబాబు కలిసి 'తిమ్మరుసు' సినిమా సెట్‌లో సందడి చేశారు. ఎన్టీఆర్‌ పాపులర్‌ సాంగ్‌ 'చట్టానికి న్యాయానికి జరిగిన..' పాటలో బ్రహ్మాజీ నటించడం, ఆయన వెనుక రవిబాబు ఎక్స్‌ప్రెషన్స్‌ వీక్షకుల్ని తెగ నవ్విస్తున్నాయి. ఈ వీడియోను రవిబాబు సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

తన అన్నయ్య విజయ్‌ దేవరకొండతో కలిసి బాల్యంలో తీసుకున్న ఫొటోను ఆనంద్‌ దేవరకొండ షేర్‌ చేశారు. 'వేసవిలో రోజంతా క్రికెట్‌ ఆడటం. చీటింగ్‌, ఫైటింగ్‌. విజయ్‌ నా ఫుడ్‌ దొంగిలించడం.. మిడిల్‌ క్లాస్‌ లైఫ్‌. రోజు పూర్తయ్యే సరికి నేను, అన్నయ్య ఒక్కటే.. 'మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌ ట్రైలర్‌' నవంబరు 20న విడుదల కాబోతోంది’ అని పేర్కొన్నారు.

ప్రముఖ గాయని సునీత తన కుమారుడు ఆకాశ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్‌డే మై లవ్‌.. నా ప్రియమైన కుమారుడు' అంటూ ఫొటోలు షేర్‌ చేశారు.

కథానాయిక మెహరీన్‌ గత కొన్ని రోజులుగా మాల్దీవుల్లో విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాల మధ్య తీసుకున్న ఫొటోల్ని షేర్‌ చేశారు. తన పుట్టినరోజును మాల్దీవుల్లో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ప్రేమ గీతం ఇలా 'రంగులద్దుకుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.