ETV Bharat / sitara

'క్లాప్​-కెమెరా-యాక్షన్​'తో ఇండస్ట్రీలో సందడి - movie start latest news updates

కరోనా మహమ్మారి కారణంగా నెలల తరబడి నిలిచిపోయిన సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే సందడి మొదలవుతోంది. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. పలు భారీ ప్రాజెక్టులు చిత్రీకరణల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

cinema shootings
సినీ పరిశ్రమ
author img

By

Published : Aug 24, 2020, 7:08 AM IST

కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితులతో కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉండిపోయిన చిత్ర పరిశ్రమలో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది. క్లాప్‌ చప్పుళ్లు, యాక్షన్‌ హంగామా సందడులతో నూతన ఉత్తేజాన్ని సంతరించుకోబోతుంది. ఇప్పటికే దర్శకుడు క్రిష్‌, ప్రశాంత్‌ వర్మ లాంటి దర్శకులు చిత్రీకరణలతో బిజీ అవ్వగా ఇప్పుడు అగ్ర హీరోలు ప్రభాస్‌, యశ్‌ తదితరులూ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ... షూటింగ్‌లు చేసుకోమని కేంద్ర ప్రభుత్వమూ అనుమతులు ఇచ్చేసింది. కొంత భాగం చిత్రీకరణ ఉన్నవి, చిన్న సినిమాలు ఇప్పటికే ఈ బాట పట్టాయి. ప్రస్తుతం పెద్ద సినిమాలు, హీరోలు షూటింగ్‌కి రెడీ అవుతుండటం వల్ల ఇండస్ట్రీలో సందడి మొదలైపోయింది.

సెప్టెంబరు నుంచి 'రాధే శ్యామ్‌'..

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధే శ్యామ్‌'. 'జిల్‌' ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఓ ప్రత్యేక కాలానికి సంబంధించిన వైవిధ్యభరిత ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితులతో తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణ.. హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభం కానుంది. వినాయక చవితి సందర్భంగా శనివారం ఈ శుభవార్తను ట్విట్టర్​లో అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు రాధాకృష్ణ.

"సెప్టెంబరు రెండో వారం నుంచి 'రాధేశ్యామ్‌' చిత్రీకరణ తిరిగి ప్రారంభించనున్నాం. సుదీర్ఘమైన ఈ కీలక షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు మిగిలిన చిత్ర బృందం పాల్గొనబోతుంది" అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు రాధాకృష్ణ. ఈ షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ ఆస్పత్రి సెట్‌తో పాటు యూరోప్‌ స్ట్రీట్‌ సెట్‌ను ఇప్పటికే సిద్ధం చేసింది చిత్రబృందం. త్వరలోనే మరికొన్ని కీలక సెట్లను నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 26 నుంచి 'కేజీఎఫ్‌ 2'..

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్‌ ఇండియా చిత్రం 'కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 2'. గతంలో వీళ్లిద్దరి కలయిక నుంచి వచ్చిన హిట్‌ సినిమా 'కె.జి.ఎఫ్‌ ఛాప్టర్‌ 1'కు కొనసాగింపుగా రూపొందుతోన్న సినిమా ఇది. విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. షూటింగ్‌ కొత్త షెడ్యూల్‌ను ఆగస్టు 26 నుంచి ప్రారంభించనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

"బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ఆగస్టు 26 నుంచి షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. పదిరోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ప్రకాష్‌రాజ్‌, మాళవిక అవినాష్‌ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. దీంతో క్లైమాక్స్‌ ఫైట్‌ మినహా చిత్రీకరణ పూర్తవుతుంది" అని యూనిట్‌ తెలియజేసింది. ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడు అధీరాగా కనిపించబోతుండగా.. సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీత దర్శకుడు.

cinema shootings
'కేజీఎఫ్​​ 2'లో సంజయ్​ దత్​

మరోవైపు విదేశాల్లో ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌ 'బెల్‌బాటమ్‌', ఆమిర్‌ఖాన్‌ 'లాల్‌సింగ్‌ చద్దా' షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.