Manchu Vishnu on movie tickets issue : 'సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారు.. ఏపీలో తగ్గించారని'.. 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఈ విషయంపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని కోరారు. సినిమా టికెట్లపై తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంటుందని.. ఆ నిర్ణయం మేరకే ముందుకెళ్తామని తెలిపారు. అంతేగానీ వ్యక్తిగతంగా తన నిర్ణయంతో పనిలేదని స్పష్టం చేశారు. ఎవరూ తన అభిప్రాయం అడగట్లేదని చెప్పారు. టికెట్లపై వైఎస్ హయాంలోనే జీవో వచ్చిందన్న విష్ణు.. ముందు దానిపైనా చర్చ జరగాలని అన్నారు.
'సినిమా టికెట్ల ధరలపై ఒకరిద్దరు మాట్లాడి వివాదం చేయడం సరికాదు. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. నేను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేను. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. టికెట్ల ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసింది. చిరంజీవి, జగన్ మధ్య భేటీ వారి వ్యక్తిగత సమావేశం మాత్రమే.. దాన్ని అసోసియేషన్ భేటీగా భావించకూడదు.'
- మంచు విష్ణు , 'మా' అధ్యక్షుడు
Megastar Chiranjeevi on movie tickets issue : ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆహ్వానం మేరకు విజయవాడ వెెెళ్లిన ఆయన.. గంటన్నరపాటు ఏపీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ పెద్దగా కాకుండా పరిశ్రమ బిడ్డగా వచ్చానని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ అంశాలపై మరోమారు సమావేశం జరిగే అవకాశముందని చిరంజీవి వెల్లడించారు.
ఇవీ చదవండి :