మంచి పనిచేస్తున్న విజయ్ దేవరకొండపై పలువురు బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ అన్నారు. అతడికి తాను మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పారు.
ఛారిటీ ద్వారా మధ్య తరగతి కుటుంబాలకు సాయం చేస్తున్న విజయ్‌పై నకిలీ వార్తలు రాస్తున్న వారిని తాను నిలదీస్తున్నానని బెనర్జీ అన్నారు. విరాళాలు ఇచ్చేది తమ ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తప్పుడు వార్తలు రాసే వారు బయటికొచ్చి మాట్లాడాలని చెప్పారు. ఇకపై ఇలాంటివి రాస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండకు తాను మద్దతు ఇస్తున్నానని వెల్లడించారు. 'మా' తరఫున అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. ఇతడికి జరిగినట్టు మరెవరికీ జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని చెప్పారు.