ETV Bharat / sitara

టాలీవుడ్​ రీమేక్ కింగ్స్.. ఎవరు టాప్? - Allu Arjun remake movies

వేరే భాషల్లో హిట్ అయిన చాలా చిత్రాలు తెలుగులో రీమేకయ్యాయి. అలాగే ఇక్కడ విజయవంతమైన సినిమాలు వేరే భాషల్లోనూ రీమేక్​గా రూపొందాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్​లో ఏ హీరో ఎన్ని రీమేక్​లు చేశారో చూద్దాం.

Most number of Remake Movies by Tollywood Heroes
టాలీవుడ్​లో రీమేక్ కింగ్స్ వీరే!
author img

By

Published : May 5, 2021, 9:32 AM IST

రీమేక్​లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు! మంచి కథ, కథనం ఉంటే ఆ సినిమాను వేరే భాషల్లోనూ తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తారు దర్శకనిర్మాతలు. అయితే ఇందులోనూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన విధంగా కథలో మార్పులు చేయాలి. లేదా అగ్రహీరో అయితే అతడికి తగ్గట్లుగా కథనం మార్చాలి. ఇన్ని సవాళ్ల నడుమ కొందరు హీరోలు రీమేక్​లవైపే ఎక్కువగా దృష్టిసారించిన వారూ ఉన్నారు. విక్టరీ వెంకటేశ్, చిరంజీవి, బాలకృష్ణ కూడా అరువు తెచ్చుకున్న కథల్లో నటించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్​లో ఎక్కువ రీమేక్​లు చేసిన హీరోలు ఎవరో చూద్దాం.

వెంకటేశ్

తన కెరీర్​లో కుటుంబ కథా చిత్రాలతో పాటు మాస్ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు విక్టరీ వెంకటేశ్. ఎక్కువగా రీమేక్​లపైనే దృష్టిపెట్టారు. ఇందులో ముఖ్యంగా 'టూ టౌ రౌడీ', 'చంటి', 'సుందరకాండ', 'కొండపల్లి రాజా', 'పోకిరి రాజా', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'సూర్యవంశం', 'రాజా', 'శీను', 'జెమినీ', 'వసంతం', 'బాడీగార్డ్', 'సంక్రాంతి', 'ఘర్షణ', 'గురు', 'దృశ్యం', 'నారప్ప', 'దృశ్యం 2' వంటి రీమేక్​లు ఉన్నాయి. ఇందులో 'నారప్ప', 'దృశ్యం 2' ఇంకా విడుదల కావాల్సి ఉంది.

venkatesh
వెంకటేశ్

చిరంజీవి

తన ఆల్​రౌండ్ పర్ఫామెన్స్​తో మెగాస్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. ఈయన కూడా రీమేక్​ల వైపు మొగ్గు చూపారు. తన కెరీర్​లో దాదాపు 17 చిత్రాలు అరువు కథలే. ఇందులో 'పట్నం వచ్చిన పతివ్రతలు', 'విజేత', 'పసివాడి ప్రాణం', 'హిట్లర్', 'స్నేహం కోసం', 'ఘరానా మొగుడు', 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'శంకర్ దాబా జిందాబాద్', 'ఖైదీ నెం.150', 'లూసిఫర్', 'వేదాళం' రీమేక్​లు ఉన్నాయి. ఇందులో 'లూసిఫర్', 'వేదాళం' రీమేక్​లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.

chiranjeevi
చిరంజీవి

బాలకృష్ణ

అటు పౌరాణిక, జానపద చిత్రాలపై మక్కువ చాటుకుంటూనే మాస్ ప్రేక్షకుల్నీ అలరించారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈయన కూడా రీమేక్​లు చేశారు. ఇందులో 'ఆత్మబలం', 'మంగమ్మ గారి మనవడు', 'ముద్దుల మామయ్య', 'లక్ష్మీ నరసింహా', 'పాండురంగడు', 'శ్రీరామరాజ్యం', 'ముద్దుల మేనల్లుడు', 'అన్నదమ్ముల అనుబంధం' వంటి చిత్రాలున్నాయి. ఇందులో 'పాండురంగడు', 'శ్రీరామరాజ్యం'.. ఎన్టీఆర్ నటించిన 'పాండురంగ మహత్యం', 'లవకుశ'లకు రీమేక్​గా తెరకెక్కాయి.

balakrishna
బాలకృష్ణ

నాగార్జున

ప్రస్తుతమున్న అగ్రహీరోల్లో ఆధ్యాత్మిక పాత్రలతో మెప్పించిన హీరో ఎవరంటే అది నాగార్జున అనే చెప్పాలి. తన పాత్రల్లో అంతగా లీనమైపోయారు. ఈ హీరో కూడా రీమేక్​ చిత్రాల వైపు మొగ్గు చూపారు. కెరీర్​లో దాదాపు 12 రీమేక్​లు చేశారు. ఇందులో 'నేటి సిద్దార్థ', 'విక్రమ్', 'నిర్ణయం', 'నువ్వు వస్తావని', 'చంద్రలేఖ', 'నిన్నే ప్రేమిస్తా', 'స్నేహమంటే ఇదేరా', 'ఊపిరి', 'రాజు గారి గది 2' వంటి చిత్రాలున్నాయి.

nagarjuna
నాగార్జున

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్.. టాలీవుడ్​లో ఈ పేరుకున్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆయన సినిమా థియేటర్లకు వస్తుందంటే బాక్సాఫీస్​ వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ హీరో కూడా తన కెరీర్​లో ఎక్కువగా రీమేక్ చిత్రాలే చేశారు. అవేంటో చూద్దాం. 'గోకులంలో సీత', 'సుస్వాగతం', 'ఖుషి', 'అన్నవరం', 'తీన్​మార్', 'గబ్బర్​సింగ్', 'గోపాల గోపాల', 'కాటమరాయుడు', 'వకీల్​సాబ్', 'అయ్యప్పనుమ్ కోషియుమ్'. ఇందులో 'వకీల్​సాబ్' ఇటీవలే విడుదలవగా, 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది.

pawan kalyan
పవన్ కల్యాణ్

రవితేజ

మాస్ మహారాజ్​గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు రవితేజ. ఈ హీరో రీమేక్​లు చేసింది తక్కువే. అందులో 'శంభో శివ శంభో', 'ఇడియట్', 'దొంగోడు', 'వీడే', 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' వంటి చిత్రాలున్నాయి.

raviteja
రవితేజ

వీరితో పాటు ప్రభాస్ (యోగి, బిల్లా), చరణ్​ (తుఫాన్, ధృవ), తారక్ (నరసింహుడు), నాగ చైతన్య (తఢాకా, ప్రేమమ్), నితిన్ (మాస్ట్రో), రామ్ (మసాలా, రెడ్), నాని (భీమిలి కబడ్డీ జట్టు, అహా కళ్యాణం), శర్వానంద్ (జాను, క్లాస్​మేట్స్, నువ్వా నేనా), కల్యాణ్ రామ్ (అభిమన్యు, విజయదశమి) వంటి రీమేక్​లు చేశారు.

prabhas
ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.