ETV Bharat / sitara

'బ్యాచ్‌లర్‌'గా అఖిల్ వచ్చేది అప్పుడే!

అక్కినేని హీరో అఖిల్​ నూతన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారో తెలిసింది.

most legible bachelor release date
'బ్యాచ్‌లర్‌'గా అఖిల్ వచ్చేది అప్పుడే!
author img

By

Published : Jan 12, 2021, 10:28 AM IST

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. పూజా హెగ్డే కథానాయిక. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకో షెడ్యూల్‌ చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ నెలాఖరుతో పూర్తయ్యే ఆ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.

మొదట సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవి లక్ష్యంగా ముస్తాబవుతోంది. యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ్యాచ్‌లర్‌గా అఖిల్‌ చేసే సందడి ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఛాయాగ్రహణం: ప్రదీశ్‌ ఎమ్‌.వర్మ.

ఇదీ చూడండి: ఈ మైలురాయికి 20ఏళ్లు పట్టింది: బన్నీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.