'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' రాకకు అంతా సిద్ధమైంది. జూన్ 19న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా అఖిల్-పూజా హెగ్డేల సూపర్ పోస్టర్ను పంచుకుంది.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ఈ సినిమాను తీశారు దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్. గతేడాదే విడుదల కావాల్సిన, కరోనా లాక్డౌన్ వల్ల అదికాస్త వాయిదా పడింది. ఇటీవల టాలీవుడ్లో కొత్త చిత్రాల విడుదల తేదీలు ప్రకటిస్తున్న నేపథ్యంలో దీని రిలీజ్పైనా స్పష్టతనిచ్చారు.
