ETV Bharat / sitara

12th Man: 'దృశ్యం' దర్శకుడితో మరోసారి మోహన్​లాల్​ - దృశ్యం 2

అగ్రకథానాయకుడు మోహన్​లాల్​(Mohanlal), దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph).. 'దృశ్యం' సిరీస్​తో మలయాళంలో సూపర్​హిట్​ కాంబినేషన్​గా పేరొందింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరో కొత్త చిత్రం కోసం పనిచేయనున్నారు. ఆ సినిమాకు '12th మ్యాన్'(12th Man) అనే టైటిల్​ను ఖరారు చేశారు. ​

Mohanlal teams up with Drishyam director Jeethu Joseph yet again
12th Man: 'దృశ్యం' దర్శకుడితో మరోసారి మోహన్​లాల్​
author img

By

Published : Jul 5, 2021, 1:10 PM IST

'దృశ్యం' సిరీస్​తో సూపర్​హిట్​గా కాంబినేషన్​గా పేరొందిన మలయాళ సూపర్​స్టార్​ మోహన్​లాల్​(Mohanlal)-దర్శకుడు జీతూ జోసెఫ్​(Jeethu Joseph) మరో కొత్త సినిమా కోసం పనిచేయనున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న మూడో చిత్రానికి '12th​​ మ్యాన్​'(12th Man) టైటిల్​ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని మోహన్​లాల్​తో పాటు చిత్ర నిర్మాణసంస్థ ఆశీర్వాద్​ సినిమాస్​ ట్విట్టర్​లో వెల్లడించింది.

ఆశీర్వాద్​ సినిమాస్​ బ్యానర్​పై ఆంటోని పెరంబవూర్​(Antony Perumbavoor) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్​ జరుపుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది. మరోవైపు మోహన్​లాల్​, పృథ్వీరాజ్​ సుకుమారన్​(Prithviraj Sukumaran) కాంబినేషన్​లో 'బ్రో డాడీ' సినిమా తెరకెక్కనుంది.

మోహన్​లాల్​ కథానాయకుడిగా జీతూ జోసెఫ్​ దర్శకుడిగా రూపొందిన తొలి చిత్రం 'దృశ్యం'(Drishyam). 2013లో మలయాళంలో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద విజయం సాధించడం వల్ల ఈ సినిమా సీక్వెల్​గా 'దృశ్యం 2'ను(Drishyam Sequel) ఓటీటీలో రిలీజ్​ చేశారు. ఈ సినిమాకూ ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభించింది.

ఇదీ చూడండి.. మోహన్​లాల్.. 'ది కంప్లీట్ మ్యాన్' ఆన్ స్క్రీన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.