ETV Bharat / sitara

'దృశ్యం 2' షూటింగ్ ప్రారంభం.. కానీ ఒక్క షరతు! - వెంకటేష్ దృశ్యం 2

మోహన్​లాల్-మీనా జంటగా నటిస్తున్న 'దృశ్యం 2' షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని కథానాయకుడు ట్వీట్ చేశారు.

Mohanlal starrer Drishyam 2 goes on the floors
మోహన్​లాల్
author img

By

Published : Sep 21, 2020, 6:33 PM IST

మోహన్‌లాల్‌, మీనా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'దృశ్యం-2'. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటోనీ పెరంబవుర్‌ నిర్మాత. ఇటీవల మోహన్​లాల్ పుట్టినరోజు సందర్భంగా 'దృశ్యం' సీక్వెల్‌ను ప్రకటించారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో షూటింగ్​ను వాయిదా వేశారు.

రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం చిత్రీకరణను ప్రారంభించారు. ఈనెల 26వ తేదీ నుంచి సెట్స్‌లోకి మోహన్‌లాల్‌ అడుగు పెట్టనున్నారని సమాచారం. యూనిట్‌ మొత్తానికి కండీషన్‌ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నటించే వారు, తమ పాత్రల షూటింగ్‌ పూర్తయ్యే వరకు ఎటువంటి ప్రయాణాలు చేయడానికి వీలు లేదని షరతు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

Mohanlal starrer Drishyam 2 goes on the floors
దృశ్యం 2 షూటింగ్ ప్రారంభం

2013లో విడుదలైన 'దృశ్యం' బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మలయాళ ఇండస్ట్రీలో రూ.50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచింది. మోహన్‌లాల్‌ నటించిన 'మర్కర్‌' ఈ ఏడాది ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా సరే కొవిడ్‌ ప్రభావంతో దానిని వాయిదా వేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.