ETV Bharat / sitara

MAA Elections: ' 'మా' భవనాన్ని ఎందుకు అమ్మేశారు?' - మా భవనంపై మోహన్​బాబు

'మా' ఎన్నికల విషయమై మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎలక్షన్స్​పై ఓ నిర్ణయానికి వచ్చేందుకు 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఇందులో పాల్గొన్న నటుడు మోహన్​బాబు.. గతంలో 'మా' కోసం కొనుగోలు చేసిన భవనం ఎందుకు అమ్మేశారంటూ ప్రశ్నించారు.

mohanbabu
మోహన్​బాబు
author img

By

Published : Aug 22, 2021, 2:54 PM IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు 'మా' క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. కరోనా పరిస్థితుల రీత్యా వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో నటుడు మోహన్‌బాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

'మా' కోసం గతంలో ఓ భవనం కొని అమ్మేశారని మోహన్‌బాబు గుర్తుచేశారు. అధిక మొత్తంతో భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే దానిని ఎందుకు అమ్మేశారని ప్రశ్నించారు. అసోసియేషన్‌ భవనం అమ్మకంపై ఎవరైనా మాట్లాడారా? అని నిలదీశారు. అసోసియేషన్‌ భవనం విషయం తనను ఎంతో కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: MAA Elections: 'మా' గురించి మంచు విష్ణు పోస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.