నట ప్రపూర్ణ మోహన్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడ సముద్రపు ఒడ్డున సేద తీరుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించారు. ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమా.. జనవరి 29న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నాగశౌర్య హీరోగా కొత్త చిత్రం రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ లోగో విడుదల చేశారు. 'పోలీసు వారి హెచ్చరిక' టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేపీ రాజేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాతగా వ్యవహరించనున్నారు.