ETV Bharat / sitara

'పెదరాయుడు' ఇంగ్లీష్ డైలాగ్​కు 25 ఏళ్లు - రజినీకాంత్ మోహన్​బాబు పెదరాయుడు

కలెక్షన్ కింగ్ మోహన్​బాబు, సూపర్​స్టార్ రజినీకాంత్ కాంబినేషన్​లో వచ్చిన అద్భుత సినిమా 'పెదరాయుడు'.. ఈ సోమవారానికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు చిత్రబృందం పలు విశేషాలను పంచుకుంది.

'పెదరాయుడు' ఇంగ్లీష్ డైలాగ్​కు 25 ఏళ్లు
మోహన్​బాబు
author img

By

Published : Jun 15, 2020, 9:24 AM IST

'పాట వచ్చి పదేళ్లయినా అందులో పవర్ తగ్గలేదు' అంటూ ఓ సినిమాలో అలీ చెప్పిన డైలాగ్​.. 'పెదరాయుడు' చిత్రానికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా వచ్చిన పాతికేళ్లయినా.. అందులోని డైలాగుల్లో స్టామినా ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మోహన్​బాబు.. 'ఫిష్-వాటర్.. ఫిష్-ఫిషర్​మ్యాన్' అంటూ పలికే ఇంగ్లీష్ డైలాగ్​ అయితే మీకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అయితే 'పెదరాయుడు' 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్​బాబు, దర్శకుడు రవిరాజా పినిశెట్టి, సంగీత దర్శకుడు కోటి.. పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

'పెదరాయుడు' విశేషాలు పంచుకున్న చిత్రబృందం
  1. 'పెదరాయుడు' సినిమాకు దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు క్లాప్ కొట్టారు.
    PEDHARAYUDU NTR
    'పెదరాయుడు' సినిమాకు క్లాప్​ కొట్టిన నందమూరి తారక రామారావు
  2. కలెక్షన్ కింగ్ మోహన్​బాబు.. ఇందులో ప్రధాన పాత్ర పోషించడం సహా ద్విపాత్రాభినయం చేశారు.
  3. సూపర్​స్టార్ రజినీకాంత్ చేసిన 'పాపారాయుడు' రోల్.. సినిమాను శిఖరాగ్రాన కూర్చోబెట్టింది. ఆయన మేనరిజమ్, ఆహార్యం, డైలాగ్స్​ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి.
    mohan babu rajinikanth pedarayudu movie
    'పెదరాయుడు' సినిమాలో మోహన్​బాబు-రజినీకాంత్
  4. తమిళంలో వచ్చిన 'నాట్టమై'కు రీమేక్ 'పెదరాయుడు'.
  5. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రవిరాజా పినిశెట్టి.. టాలీవుడ్​ ప్రేక్షకుల్ని మెప్పించారు. కోటి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
  6. ఈ సినిమా 53 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితం కావడం సహా సిల్వర్​ జూబ్లీ కూడా జరుపుకుంది.
  7. ఇందులో సౌందర్య పాత్ర పశ్చాత్తాపం చెందే సీన్​లో మోహన్​బాబు చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. "భారతి.. భార్యభర్తల సంబంధం గురించి కుటుంబసభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా! ద రిలేషన్​షిప్ బిట్వీన్ టూ పెర్షన్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ.. మస్ట్ బీ లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్.. బట్ ఇట్ షుడ్ నాట్ లైక్ ఏ ఫిష్ అండ్ ఫిషర్​మ్యాన్.. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు.. నీకు ఇంగ్లీషులో చెబితే అర్ధమవుతుందని చెప్పాను. గ్రామర్​లో తప్పులుంటే మన్నించు అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు"
  8. MOHANBABU pedarayudu
    'పెదరాయుడు' సినిమాలో మోహన్​బాబు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.