ETV Bharat / sitara

హలో.. రియా ఉందా?: విసుగెత్తిపోయిన ఆ వ్యక్తి - సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​

రియా ఫోన్ నంబర్ అనుకుని ముంబయికి చెందిన ఓ వ్యక్తికి విపరీతంగా కాల్స్ చేస్తున్నారు. విసుగెత్తిపోయిన అతడు 100కు పైగా నంబర్లను బ్లాక్​ చేయడం సహా ఫోన్​ను స్విచ్చాప్​ చేసేశాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది?

Mistaken for Rhea Chakraborty, a clerical staffer from Navi Mumbai faces a volley of abuse
రియా చక్రవర్తి
author img

By

Published : Aug 12, 2020, 1:44 PM IST

'శివమణి' సినిమాలో నాగార్జున ఫోన్​ నంబరు అనుకుని హాస్యనటుడు ఎంఎస్​ నారాయణకు కొంతమంది విపరీతంగా కాల్స్​ చేస్తారు. ప్రతి ఒక్కరూ 'శివమణి ఉన్నాడా?' అని అడుగుతూ ఉంటారు. ఆ నంబరు శివమణిది కాదు తనదే అని ఎంఎస్​ ఎంత చెప్పినా వినిపించుకోరు. దాంతో విసిగిపోయిన అతడు చివరికు, శివమణిని తానే చంపేసినట్లు కాల్స్​ చేసిన వారికి చెబుతాడు. నటి రియా చక్రవర్తి విషయమై ఇలాంటి సన్నివేశమే ముంబయికి చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది.

సీన్​ రిపీట్​

సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి అనుకుని ఓ వ్యక్తికి విపరీతంగా కాల్స్​ చేస్తున్నారు. కొందరైతే సందేశాల్లోనే దూషిస్తున్నారు. తాను రియాను కాదని ఎంత చెప్పినా వినకుండా, తనను కాలర్స్​ విసిగిస్తున్నారని ముంబయికి చెందిన ఓ వ్యక్తి మొరపెట్టుకున్నాడు. ఇప్పటివరకు తన మొబైల్​లో దాదాపు 150 నంబర్లను బ్లాక్​లిస్టులో పెట్టినట్లు ఓ పత్రికకు వివరించాడు.

రియా ఉందా?

ముంబయి మిర్రర్​ నివేదిక ప్రకారం.. రియా నంబరుకు బాధితుడి చరవాణి నంబరుకు కేవలం ఒక అంకె తేడా. దీంతో పొరపాటున ఆమె నంబర్ అనుకుని ఈ వ్యక్తికి చేస్తున్నారు. వారం రోజుల నుంచి అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారు. ఫలితంగా అతడు తన చరవాణిని స్విచ్ఛాఫ్​ చేయాల్సి వచ్చింది.

"గత కొన్నిరోజులుగా 'రియా ఉందా?' అని ఫోన్లు​ వస్తున్నాయి. బాలీవుడ్​ నటి రియా కోసం​ చేస్తున్నారని నాకు మొదట అర్థం కాలేదు. కానీ, కొన్ని రోజుల తర్వాత ఆమె కోసమేనని గుర్తించాను. కొందరి నుంచి అసభ్యకర సందేశాలతో పాటు వాట్సప్​ వీడియోకాల్స్​ వస్తున్నాయి. రాంగ్​ నంబర్​ అని చెప్పినా.. నా ఫొటో ఒకసారి పంపమని కాలర్స్​ అంటున్నారు. అప్పటి నుంచి కాల్స్​ను పట్టించుకోలేదు. అలా నాకు విసుగు వచ్చేసింది" అని బాధితుడు వెల్లడించాడు.

నంబరు అలా తెలిసింది

ఓ టీవీ ఛానెల్​లో రియా, సుశాంత్​లకు సంబంధించిన కాల్​ రికార్డింగ్స్​, వాట్సప్​ చాటింగ్​లు ప్రసారం చేశారని తెలుస్తోంది. అందులో కనిపించిన రియా నంబరుకు బాధితుడి చరవాణి నంబరుకు ఒక్క సంఖ్య తేడా ఉంది. దానిని గమనించిన పలువురు నెటిజన్లు.. హీరోయిన్​ అనుకుని అతడికి కాల్స్ చేయడం మొదలుపెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.