2013లో భారతదేశం చేపట్టిన 'మంగళయాన్' మిషన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రం 'మిషన్ మంగళ్'. ప్రముఖ శాస్త్రవేత్త రాకేశ్ ధావన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాకేశ్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. టీజర్ ఆసక్తిని కలిగిస్తోంది.
"ఒక దేశం.. ఒక కల.. ఒక చరిత్ర.. భారత దేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్‌యాన్. ఈ స్ఫూర్తిదాయక కథ ఆధారంగా రానున్న చిత్ర టీజర్ ఇదుగో" అంటూ ట్విట్టర్లో టీజర్‌తో పాటు వ్యాఖ్య జోడించాడు అక్షయ్ కుమార్.
-
Ek Desh. Ek Sapna. Ek Ithihaas. The true story of India’s #SpaceMission to Mars is here. #MissionMangalTeaser out now! https://t.co/DSTulMrX8G@taapsee @sonakshisinha @vidya_balan @TheSharmanJoshi @MenenNithya @IamKirtiKulhari @Jaganshakti @foxstarhindi #HopeProductions @isro
— Akshay Kumar (@akshaykumar) July 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ek Desh. Ek Sapna. Ek Ithihaas. The true story of India’s #SpaceMission to Mars is here. #MissionMangalTeaser out now! https://t.co/DSTulMrX8G@taapsee @sonakshisinha @vidya_balan @TheSharmanJoshi @MenenNithya @IamKirtiKulhari @Jaganshakti @foxstarhindi #HopeProductions @isro
— Akshay Kumar (@akshaykumar) July 9, 2019Ek Desh. Ek Sapna. Ek Ithihaas. The true story of India’s #SpaceMission to Mars is here. #MissionMangalTeaser out now! https://t.co/DSTulMrX8G@taapsee @sonakshisinha @vidya_balan @TheSharmanJoshi @MenenNithya @IamKirtiKulhari @Jaganshakti @foxstarhindi #HopeProductions @isro
— Akshay Kumar (@akshaykumar) July 9, 2019
అంగారక గ్రహంపై 'మంగళ్‌యాన్' వెళ్లేందుకు లాంచింగ్ ప్యాడ్ వద్ద సిద్ధంగా ఉండటం. అక్షయ్.. అతని బృందమంతా ఆ ప్రయోగాన్ని విజయవంతం చేసే పనిలో నిమగ్నమై ఉన్న సన్నివేశాలతో టీజర్‌ను ఆసక్తికరంగా ప్రారంభించారు. ఇందులో శాస్త్రవేత్తల బృందానికి అధికారిణిగా విద్యాబాలన్ కనిపించనుంది. నిత్యా మేనన్, తాప్సీ, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరి ఇతరపాత్రలు పోషించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ఆగస్టు 15న బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోటీ