ETV Bharat / sitara

వారిని ఎంతగానో మిస్ అవుతున్న చిరంజీవి - chiru news

అమ్మ, తమ్ముళ్లు, సోదరీమణులను చాలా మిస్ అవుతున్నానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అందుకు సంబంధించి గతంలో తీసుకున్న ఓ ఫొటోను ట్వీట్ చేశారు.

వారిని ఎంతగానో మిస్ అవుతున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి
author img

By

Published : Apr 19, 2020, 1:47 PM IST

తమ్ముళ్లు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌తోపాటు సోదరీమణులను కలవడాన్ని తాను ఎంతగానో మిస్‌ అవుతున్నానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ఇటీవల సోషల్‌మీడియాలోకి అడుగుపెట్టిన ఆయన.. కరోనా గురించి ప్రజలకు అనేక విధాలుగా అవగాహన కల్పిస్తూ తరచూ పోస్టులు చేస్తున్నారు. తన కుటుంబసభ్యులకు సంబంధించిన చిత్రాలనూ సందర్భానుసారంగా అభిమానులతో పంచుకుంటున్నారు.

Missing meeting the dear ones Says Chiranjeevi
చిరంజీవి ట్వీట్ చేసిన ఫొటో

లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం.. తన తల్లి అంజనాదేవి, తమ్ముళ్లు పవన్‌కల్యాణ్‌, నాగబాబు, సోదరీమణులు మాధవి, విజయ దుర్గాలతో కలిసి భోజనం చేస్తున్నప్పటి ఫొటోను ఈరోజు ట్వీట్ చేశారు.

'లాక్‌డౌన్‌కు ముందు ఓ ఆదివారం నాడు ఇలా. ప్రియమైన వారిని కలవడం ఎంతగానో మిస్‌ అవుతున్నాను. మీలో చాలామందికి ఇలాంటి భావనే ఉందని నాకు తెలుసు. మన సాధారణ జీవితం త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుందని నమ్ముతున్నాను. అమ్మ,నేను- చెల్లెళ్లు, తమ్ముళ్లు' అని ట్విట్టర్​లో చిరంజీవి రాసుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.