ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతికి చింతిస్తూ పలువురు ప్రముఖులు సోషల్మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. వీరితోపాటు విదేశాల్లో ఉన్న భారతీయులూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఎస్పీ బాలు మృతి పట్ల కెనడాకు చెందిన అల్బర్టా రాష్ట్ర మంత్రి శివలింగ ప్రసాద్ పండా సంతాపాన్ని ప్రకటించారు. బాలు కుటుంబసభ్యులకు ప్రసాద్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంగీత ప్రియుల హృదయాల్లో ఎస్పీబీ చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు.
గుంటూరులోని సంగంజాగర్లమూడిలో జన్మించిన శివలింగ ప్రసాద్ పండా.. కెనడాలోని అల్బర్టా రాష్ట్ర క్యాబినేట్లో మంత్రిగా పని చేస్తున్నారు.