ETV Bharat / sitara

'మా మనోభావాలు దెబ్బతీసేలా ఆ మూవీ​ పోస్టర్​.. వెంటనే తొలగించండి' - mim mlas met minister talasani srinivas and complained on fir movie

FIR Movie Poster Issue: ముస్లింల మనోభావాలు దెబ్బ తీసేలా ఎఫ్​ఐఆర్​ తెలుగు సినిమా పోస్టర్​ ఉందని.. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆరోపించారు. పోస్టర్​పై అరబిక్​ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు.

disputes on fir movie
ఎఫ్​ఐఆర్​ సినిమా వివాదం
author img

By

Published : Feb 11, 2022, 6:30 PM IST

FIR Movie Poster Issue: ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఎఫ్‌ఐఆర్‌ తెలుగు సినిమా పోస్టర్‌ ఉందని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆరోపించారు. పోస్టర్​లో కథానాయకుడు ముఖంపై ముద్రించిన అరబిక్ పదాలు తొలగించాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు వారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ ఆదర్శ నగర్ ఎమ్మెల్యేల నివాస సముదాయంలోని ఆయన కార్యాలయంలో మంత్రిని.. నాంపల్లి, యాకత్​పురా, కార్వాన్ ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మెరాజ్, సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రితో పాటు కౌసర్ మొహినోద్దీన్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఎమ్మెల్యేలు వినతి పత్రం సమర్పించారు.

స్పందించిన మంత్రి తలసాని... ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబుతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ సినిమా ప్రతినిధులతో మాట్లాడి అరబిక్ పదాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నా: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.