బాలీవుడ్ గాయకుడు మికాసింగ్... పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బంధువుల వివాహం కోసం పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడ ప్రదర్శన ఇచ్చినందుకు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అతడిపై నిషేధం విధించింది. అనంతరం స్వదేశానికి వస్తూ వాఘా సరిహద్దు దగ్గర భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ నినదించాడు. ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
-
Bharat Mata ki Jai! Thank you everyone for such a warm welcome. Happy Independence Day once again and salute to our jawans. They aren’t able to celebrate any festival, all to make our lives better. Jai hind.. pic.twitter.com/cY7lQx7VUw
— King Mika Singh (@MikaSingh) August 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bharat Mata ki Jai! Thank you everyone for such a warm welcome. Happy Independence Day once again and salute to our jawans. They aren’t able to celebrate any festival, all to make our lives better. Jai hind.. pic.twitter.com/cY7lQx7VUw
— King Mika Singh (@MikaSingh) August 15, 2019Bharat Mata ki Jai! Thank you everyone for such a warm welcome. Happy Independence Day once again and salute to our jawans. They aren’t able to celebrate any festival, all to make our lives better. Jai hind.. pic.twitter.com/cY7lQx7VUw
— King Mika Singh (@MikaSingh) August 15, 2019
"భారత్ మాతా కీ జై! నన్ను సాదరంగా ఆహ్వానించినందుకు అందరికి ధన్యవాదాలు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, మన జవాన్లకు సెల్యూట్. మనం సంతోషంగా ఉండేందుకు వాళ్లు ఎలాంటి పండుగలు జరుపుకోరు. జై హింద్" -మికా సింగ్
ఆగస్టు 9న పాకిస్థాన్ కరాచి వెళ్లిన మికా సింగ్, భారత్కు గురువారం తిరిగి వచ్చాడు. తన నిషేధం విషయమై స్పందించని మికా సింగ్... ట్విట్టర్లో ఈ వీడియోను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇది చదవండి: ఆ చిత్రాలతో మియా సంపాదన ఎంతో తెలుసా..!