ETV Bharat / sitara

ఆ సింగర్​​ మేనేజర్ సౌమ్య మృతిపై వీడిన మిస్టరీ​ - మికా సింగ్​ మేనేజర్​ సౌమ్య

గాయకుడు మికాసింగ్ మేనేజర్ సౌమ్య అనుమానస్పద మృతిపై మిస్టరీ వీడింది. ఎక్కువగా మాదకద్రవ్యాల తీసుకోవడమే ఆమె చనిపోవడానికి కారణమని పోలీసులు వెల్లడించారు.

Mika Singh's manager died of 'drug overdose': Police
సింగర్​ మికాసింగ్​ మేనేజర్ సౌమ్య మృతిపై వీడిన మిస్టరీ​
author img

By

Published : Feb 22, 2020, 9:28 PM IST

Updated : Mar 2, 2020, 5:35 AM IST

బాలీవుడ్ గాయకుడు, పాప్ స్టార్ మికా సింగ్ మేనేజర్ సౌమ్య.. ఈనెల 3న అంధేరిలోని తన నివాసంలో అనుమానస్పద రీతిలో చనిపోయింది. ఈ విషయమై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కొనాళ్లుగా ఆమె మానసిక ఆందోళనతో బాధపడుతోందని, డ్రగ్స్​ అధిక మొత్తంలో తీసుకోవడమే ఈ మృతికి కారణమని పోలీసులు తేల్చారు. అంతకు ముందు ఈ విషయంపై మికా సింగ్​ సోషల్ మీడియా వేదికగా విచారాన్ని వ్యక్తం చేశాడు.

"మా ప్రియమైన సౌమ్య మమ్మల్ని విడిచి వెళ్లిపోయిందన్న వార్తను తెలియచేయటానికి ఎంతో చింతిస్తున్నాను. చిన్న వయసులోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లటం చాలా బాధ కలిగించింది. ఆమె అందమైన జ్ఞాపకాలు మాతో ఎప్పటికీ ఉంటాయి. సౌమ్య కుటుంబానికి, ఆమె భర్త జోహెబ్​ ఖాన్​కు నా సంతాపాన్ని తెలియజేస్తున్నా"

- మికా సింగ్​, బాలీవుడ్​ గాయకుడు

ఓ రోజు రాత్రి పార్టీకి వెళ్లిన సౌమ్య, తర్వాత రోజు ఉదయం 7 గంటలకు తిరిగి వచ్చింది. అనంతరం గదిలో నుంచి ఎంతకీ బయటకి రాకపోవటం వల్ల ఆమె మరణం వెలుగులోకి వచ్చింది. అదే రోజు రాత్రి 10.15 గంటల సమయంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పంజాబ్​లోని ఆమె బంధువులకు అప్పగించారు. మానసిక ఒత్తిడి కారణంగా, ఎక్కువగా మాదకద్రవ్యాలను సేవించడం వల్ల సౌమ్య మరణించిందని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి.. ఆ విషయం నన్ను కలచి వేసింది: అమిర్​ఖాన్​

Last Updated : Mar 2, 2020, 5:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.