కంగనా రనౌత్ 'మెంటల్ హై క్యా' సినిమా కథలో కలగజేసుకుంటోందని వస్తున్న వార్తలను ఖండించాడు ఆ చిత్ర దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి. ఇవన్నీ నిరాధార వదంతులంటూ కొట్టిపారేశాడు. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని కంగనా భావిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.
"రాజ్‌కుమార్ రావు, కంగనా ప్రొఫెషనల్ నటులు. వారితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నాను. సినిమా చాలా బాగా వస్తోంది. మొదటి షెడ్యూల్ ముంబయి, రెండో షెడ్యూల్ లండన్‌లో పూర్తి చేశాం. చివరి షెడ్యూల్ గత నెలలో మొదలుపెట్టాం. కంగనాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు" -ప్రకాశ్ కోవెలమూడి, దర్శకుడు
శోభా కపూర్, ఏక్తాకపూర్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.