తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలు నిజమేనని నటి మెహరీన్ తెలిపారు. త్వరలోనే తాను వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నానన్నారు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ'తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ దాదాపు 17 తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పెళ్లిపై మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.
ఆ వార్తలపై మెహరీన్ స్పందించారు. తన పెళ్లి వార్తలు నిజమేనని.. వచ్చే నెలలో నిశ్చితార్థం జరగనుందని.. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోన్నందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె వివరించారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ భిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఈ ముద్దుగుమ్మ వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని జైపుర్ అలీలా కోటలో మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. మరోవైపు 'ఎఫ్2'కు కొనసాగింపుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న 'ఎఫ్3'లో ఆమె నటిస్తోంది.
ఇదీ చూడండి: వాలంటైన్స్ డే: ప్రేమికుల నోట.. పలకాలి ఈ పాట!